మీ పాస్ పోర్టులు అవేనా

Submitted by lakshman on Fri, 01/12/2018 - 23:40

పాస్ పోర్ట్  త‌న ఐడెంటిటీని కోల్పోతున్న‌ట్లు తెలుస్తోంది. భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ‌శాఖ పాస్ పోర్టుల జారీ చేసే విష‌యంలో కొత్త నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యంతో భార‌త్ లో ఉన్న కొన్ని పాస్ పోర్టులు చెత్తుబుట్ట‌లో వేసేందుకు త‌ప్ప మ‌రే ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని అంటున్నారు. సాధార‌ణంగా పాస్ పోర్టు ను  మ‌న ఐడెంటిటీ కోసం వినియోగిస్తాం. అయితే  కేంద్రం కొత్త నిర్ణ‌యంతో అడ్ర‌స్ ఫ్రూప్ లుగా ప‌నికి రావ‌ని స‌మాచారం.
 ప్ర‌భుత్వం దేశ పౌరుల‌కు  మూడు రంగులు క‌లిగిన వేర్వేరు పాస్ పోర్టుల‌ను అంద‌జేస్తుంది. వాటిలో ఒక‌టి తెల్లరంగు విదేశీ పర్యటనల‌కు, రెడ్ పాస్ పోర్టు రాయబారులు వినిగించ‌డానికి ,మూడోదైన నీలిరంగు పాస్ పోర్టులు సాధారణ పౌరులు ఉపయోగిస్తారు. అయితే తాజాగా వీటితో పాటు మ‌రోక‌ల‌ర్ ఆరంజ్ క‌లిగిన పాస్ పోర్ట్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తుంది కేంద్రం.  దీంతో పాటు పాస్ పోర్టు చివరిలో ఉండే ECR(emigration check)ను కూడా మారుస్తున్నట్టు చెబుతున్నారు. 

ప్రస్తుతం పాస్ పోర్టు మొదటి పేజీలో ఫోటోతో కూడిన వివరాలు.. చివరి పేజీలో చిరునామా వివరాలు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఇకనుంచి ఈసీఆర్ పేజీని ఇకపై ఖాళీగా ఉంచనున్నారు. ఈసీఆర్ ను తీసేయ్యడం వల్ల.. వ్యక్తుల పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉండదు.

English Title
New passports issue on ministry of external affairs

MORE FROM AUTHOR

RELATED ARTICLES