పవన్ ఇంత పెద్ద స్టార్ అవుతాడని అనుకోలేదు

Submitted by arun on Mon, 08/06/2018 - 14:51
ps

పవన్‌ కల్యాణ్‌ మొట్టమొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ లో పవన్ పక్కన హీరోయిన్ గా నటించిన నాగార్జున మేనకోడలు సుప్రియ ఆతర్వాత సినిమాలకు దూరమమై అన్నపూర్ణ స్టూడియో బాధ్యతల్ని నిర్వహిస్తూ 22ఏళ్ల తర్వాత ‘గూఢచారి’ సినిమాతో తిరిగి రీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఆమె ఆసినిమాలో ఆమెనటించిన నదియా ఖురేషి పాత్రతో అందరినీ ఆకట్టుకుంది.  నదియా ఖురేషి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సుప్రియ నటనను అనేక మంది సెలబ్రిటీలు మెచ్చుకుంటూ మెసేజ్ లు చేస్తున్నారట.  

ఈ విషయాన్ని సుప్రియ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.  ఇదిలా ఉంచితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి సుప్రియ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద స్టార్ అవుతారని అసలు ఊహించలేదని..ఫస్ట్ ఫిల్మ్ సమయంలో పెద్దగా ఎవరితో మాట్లాడేవాడు కాదని చెప్పింది. ఇప్పటికి పవన్ కళ్యాణ్ తనను హీరోయిన్ గానే గుర్తుపెట్టుకున్నారని చెప్పింది సుప్రియ.  మంచిపాత్రలు వస్తే తప్పకుండా నటిగా జర్నీని కంటిన్యూ చేస్తానని చెప్తున్నది.  నెగెటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్స్ అంటే ఇస్తామని ఆ తరహా పాత్రలు వస్తే అసలు వదిలిపెట్టమని తన మనసులోని మాటను బయటపెట్టింది సుప్రియ. 

English Title
Never Thought Pawan Would Become A Huge Star: Supriya

MORE FROM AUTHOR

RELATED ARTICLES