బీడబ్ల్యూఎఫ్‌పై సైనా ఆగ్రహం..మద్దతు పలికిన మారిన్‌

Submitted by arun on Thu, 12/21/2017 - 12:21
nehwal marin

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ బిజీ షెడ్యూల్‌పై ఒక్కొక్కరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అవసరానికి మించి ఆడుతున్నారంటూ నిన్న చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్యానించగా, తాజాగా స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ గొంతు కలిపింది. 2018కి బీడబ్ల్యూఎఫ్‌ నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకా రం సింగిల్స్‌లో టాప్‌ 15మంది, డబుల్స్‌లో టాప్‌ పది జోడీలు కనీసం 12 టోర్నీలు ఆడాల్సి ఉంటుంది. అలా బరిలో దిగకపోతే షట్లర్లు జరిమానా ఎదుర్కోవాలి. ‘బీడబ్ల్యూఎఫ్‌ క్యాలెండర్‌ టాప్‌ ప్లేయర్లకు చేటుచేసే లా ఉంది. నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు తగినంత విరామం ఉండాలి. ఒకదానివెంట ఓ టోర్నీ లో నేను పాల్గొనలేను. ఏదో ఆడాలి కాబట్టి.. బరిలో దిగుతున్నా అన్నట్టు ఉంటుందే తప్ప విజేతను కాలే ను’ అని బుధవారం ఇక్కడ పీబీఎల్‌ కార్యక్రమంలో భాగంగా సైనా వ్యాఖ్యానించింది. 

‘బ్యాడ్మింటన్‌ను టె న్నిస్‌లా జనరంజకంగా మార్చాలని బీడబ్ల్యూఎఫ్‌ భా విస్తుంటే.. గ్రాండ్‌స్లామ్స్‌లా 4,5 టోర్నమెంట్‌లనే రూ పొందిస్తే సరిపోయేది’ అని అభిప్రాయపడింది. అలా గైతే డబ్బుతోపాటు కవరేజ్‌ కూడా పెరుగుతుందని తెలిపింది. మరో మేటి క్రీడాకారిణి కరోలినా మారిన్‌ కూడా సైనాకు మద్దతు పలికింది. బిజీ షెడ్యూల్‌కు ప్రత్యామ్నాయం లేకపోయినా.. ఫిట్‌నెస్‌కే తన మొదటి ప్రాధాన్యమని సైనా చెప్పింది. సూపర్ సిరీస్‌లు గెలవాలని నాకు నేనే సవాలు విసురుకోవడం లేదు. ఎందుకంటే గతంలో చాలా గెలిచా. కాబట్టి వాటి గురించిన ఆందోళన లేదు. కానీ నేను కోరుకున్న సమయంలో పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే బాగుంటుంది. అందుకే వచ్చే ఏడాది టోర్నీల కంటే ఫిట్‌నెస్‌పైనే ఎక్కువ దృష్టిపెడుతా అని సైనా పేర్కొంది. 

English Title
nehwal marin slam bwf for cramped calendar

MORE FROM AUTHOR

RELATED ARTICLES