తెలంగాణలో అదే నిజం కాబోతుంది: లగడపాటి

Submitted by arun on Fri, 12/07/2018 - 19:39
lp

తెలంగాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తన సర్వే వివరాలను వెల్లడించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి ఆసక్తికరంగా ఎన్నికలు ముగిశాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. తెలుగు ప్రజలే కాకుండా యావత్‌ దేశం ఈ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తోందన్నారు. సౌత్‌ అభిప్రాయాలను ఉత్తరాది ఛానళ్లు అర్థం చేసుకోలేవని లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. ఆ ఎగ్జిట్‌ పోల్స్‌ ఎప్పుడూ నిజం కాలేదని, ఇప్పుడు తెలంగాణలో అదే నిజం కాబోతుందని అన్నారు. తాము అనేక రాష్ట్రాల్లో సర్వేలు చేసినప్పటికీ తెలంగాణ ఎన్నికల్లో చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఎన్నడూ లేనివిధంగా డబ్బు పంపిణీ జరిగిందని, అనేక ప్రలోభాలు జరిగాయన్నారు. తెలంగాణ ప్రజల నాడి హస్తానికి చిక్కిందని, ప్రజాకూటమికి 65 స్థానాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అధికార టీఆర్‌ఎస్‌కు 35 స్థానాలు వస్తాయని, ఇందులో పది స్థానాలు ఎక్కువ, తక్కువ కావొచ్చునని ఆయన పేర్కొన్నారు. కూటమి మిత్రపక్షమైన టీడీపీకి ఐదు నుంచి ఏడు స్థానాలు వచ్చే అవకాశముందని చెప్పారు. బీజేపీకి ఏడు స్థానాలు, స్వతంత్రులకు ఏడు స్థానాలు వస్తాయని, ఇందులో రెండు స్థానాలు అటు-ఇటు కావొచ్చునని తెలిపారు. ఎంఐఎం ఆరు నుంచి ఏడు స్థానాలు రావొచ్చునని చెప్పారు.

English Title
ndhra Octopus Lagadapati Rajagopal Shocking Facts on National Media Survey Results

MORE FROM AUTHOR

RELATED ARTICLES