నవాజ్ షరీఫ్‌కు జైలు శిక్ష రద్దు : పాక్‌ కోర్టు తీర్పు

నవాజ్ షరీఫ్‌కు జైలు శిక్ష రద్దు : పాక్‌ కోర్టు తీర్పు
x
Highlights

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అవెన్‌ ఫీల్డ్ కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో అకౌంటబులిటీ కోర్టు విధించిన జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు...

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అవెన్‌ ఫీల్డ్ కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో అకౌంటబులిటీ కోర్టు విధించిన జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది. నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కూతురు మరియం నవాజ్‌ను జైలు నుంచి విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అవెన్‌ ఫీల్డ్ ప్రాపర్టీ కేసులో షరీఫ్‌కు 11 ఏళ్ల జైలు శిక్ష పడగా ఆయన కూతురు మరియంకు 8 ఏళ్ల శిక్ష పడింది. ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పుతో అడియాలా జైలులో ఉన్న నవాజ్ షరీఫ్‌ విడుదల కానున్నారు. 5 లక్షల బాండ్ పూచీకత్తుపై కేసులో శిక్షను అనుభవిస్తున్న వారిని రిలీజ్ చేయాలంటూ ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories