సహజ నటి!

Submitted by chandram on Tue, 12/04/2018 - 16:38
jaya

సహజ నటిగా పేరుపొందిన జయసుధ అసలు పేరు మీకు తెలుసా! సహజ నటిగా పేరుపొందిన జయసుధ అసలు పేరు సుజాత. ఈవిడ పుట్టి పెరిగినది మద్రాసులో అయినా మాతృభాష తెలుగే. నటి, నిర్మాత విజయనిర్మల ఈవిడకు మేనత్త . 1972 లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం జయసుధ మొదటి చిత్రం. జయసుధ నటించిన 300లకు పైగా సినిమాల్లో 20 తమిళ సినిమాలు, 8 మలయాళసినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి. జయసుధ 1985లో ప్రముఖ హిందీ నటుడు జితేంద్రకు దాయాది అయిన నితిన్ కపూర్ను పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. 1986 లో మొదటి కొడుకు నిహార్ మరియు 1990 లో శ్రేయంత్ పుట్టారు. శ్రీ.కో.

English Title
Natural actress!

MORE FROM AUTHOR

RELATED ARTICLES