కొండచిలువ, చిరుతపులి తారసపడ్డ వేళా.. చివరకు జరిగింది చూస్తే..

కొండచిలువ, చిరుతపులి తారసపడ్డ వేళా.. చివరకు జరిగింది చూస్తే..
x
Highlights

కొండచిలువ, చిరుతపులి రెండింటిలో ఏ ఒక్కటి మనకు కనిపించినా భయంతో అరకిలోమీటరు దూరం పరిగెడతాం.. ఎందుకంటే అవి ఎక్కడ మింగేస్తాయోనన్న భారీ భయం. రెండింటిలో...

కొండచిలువ, చిరుతపులి రెండింటిలో ఏ ఒక్కటి మనకు కనిపించినా భయంతో అరకిలోమీటరు దూరం పరిగెడతాం.. ఎందుకంటే అవి ఎక్కడ మింగేస్తాయోనన్న భారీ భయం. రెండింటిలో తేడా.. ఆకారమే అయినా అవి చేసే పనులు మాత్రం ఒకటే.. మింగేయడం. ఇదిలావుంచితే.. కొండచిలువ, చిరుతపులి రెండు ఒకేచోట తారసపడితే ఇంకేముందు పెద్ద యుద్ధమే జరిగిపోదు.. అలాంటిది రెండు ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాయో ఏమో సైలెంట్ గా ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. కానీ వేటకు అలవాటుపడ్డ పులి ఊరుకుంటుందా..? తన మానాన తాను వెళ్ళిపోతున్న కొండచిలువను పంజాతో వెనకాల కెలికింది. అంతే నన్నే కదిలిస్తావా అంటూ పాము పులి మీదకు దూకబోతే సాల్లే తీయ్ అన్నట్టు పులి తన పంజాతో పామును ఎదిరించింది. దాంతో ఆ కొండచిలువ రక్తపాతాలు ఎందుకులే అనుకుని సల్లగా జారుకుంది. పులి కూడా హమ్మయ్య ఇవాళ ఓ అమాయకురాలిని వదిలేశా.. అనుకుని అక్కడినుంచి వెళ్లిపోయింది. కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లాలోని నాగరహళె అటవీప్రాంతంలో శనివారం జరిగిన ఈ సంఘటన పర్యాటకుల కంటపడింది. దీంతో ఆ వీడియోను సామజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories