విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలంటే నీట్ తప్పనిసరి

Submitted by arun on Mon, 02/12/2018 - 10:58
NEET MBBS

విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ ఛేయబోతోంది. వారికి నీట్ తప్పనిసరి చేయబోతోంది. సమర్ధులైన వారు వైద్య విద్య చదివడానికి ఈ దిశగా కసరత్తు చేస్తోంది. ఎంబీబీఎస్ చేయాలంటే.. ప్రస్తుతం నీట్ తప్పనిసరి. ఇకపై విదేశీ విశ్వవిద్యాలయాల్లో డాక్టర్ చదువు చదవాలనుకుంటున్నవారు సైతం జాతీయ అర్హత ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి కాబోతోంది. ప్రతిభావంతులైన విద్యార్థులే విదేశాలకు వెళ్లొచ్చేలా చూడడానికి ఇది అవసరమని ప్రభుత్వం యోచిస్తోంది. 

విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదవాలనుకునేవారు ముందుగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అలాగే విదేశాల్లో వైద్య విద్య చదివి తిరిగి వచ్చాక ఎంసీఐ నిర్వహించే విదేశీ వైద్య పట్టభద్రుల పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ ఉత్తీర్ణత సాధించకపోతే భారత్‌లో వైద్యవృత్తి చేపట్టడానికి పేర్లు నమోదు చేసుకునే వీలుండదు. అయితే సగటున 12 నుంచి15 శాతం మంది మాత్రమే విదేశీ వైద్య పట్టభద్రుల అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. అంత తక్కువగా పాస్ అవ్వడానికి ప్రశ్నపత్రం కఠినంగా ఉండడం కారణమా అంటే అదీ కాదు. విదేశాల్లో వైద్య విద్య చదివారిలో కొందరికి సరైన నైపుణ్యం లేకపోవడమే ఇందుకు కారణం.  

ప్రస్తుతం ఏటా 7000 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో ఎంబీబీఎస్‌ చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది చైనా, రష్యాలను ఎంచుకుంటున్నారు. విదేశాల్లో వైద్య విద్య చేసి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అర్హత పరీక్ష పాస్ కానివారు అక్రమ పద్ధతుల్లో వైద్యం చేస్తున్నారు. అది ప్రమాదకరంగా మారుతోంది. అలాంటి వారికి ముందే బ్రేక్ వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే నీట్ అర్హత సాధించిన వారికే విదేశాల్లో ఎంబీబీఎస్ చేసేందుకు ఎన్‌వోసీ ఇవ్వాలని ఆలోచిస్తోంది.

Tags
English Title
National Eligibility cum Entrance Test must for pursuing MBBS abroad

MORE FROM AUTHOR

RELATED ARTICLES