నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో తెలుగు సినిమాల సత్తా

Submitted by santosh on Fri, 05/04/2018 - 10:53
national awards teleugu movies


ఎందరో అతిరధమమారధులు... మరెందరో సినీ ప్రముఖులు. తారాలోకం తళుక్కుమన్న వేళ... 65వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడకలు కన్నుల పండుగగా జరిగాయి. రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు స్మృతిఇరానీ,రాజవర్థన్ సింగ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఇందులో టాలీవుడ్ కు పురస్కారాల పంట పండింది.

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 65వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రదానం చేశారు.పలు విభాగాల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన సినిమాలకు అవార్డులను అందజేశారు.రాష్ట్రపతి,కేంద్రమంత్రులు స్మృతిఇరానీ,రాజవర్థన్ సింగ్ పాల్గొన్నారు. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో బాహుబలి ది కన్ క్లూజన్ సత్తా చాటింది.ఓవరాల్ గా మూడు విభాగాల్లో అవార్డ్స్ ను దక్కించుకుంది.ఖండాతరాలను దాటి సందడి చేసిన బాహుబలి2జాతీయ ఉత్తమ ప్రజాధారణ పొందిన చిత్రంగా నిలిచింది.ఈ అవార్డు ను బాహుబలి నిర్మాత ప్రసాద్ దేవినేని అవార్డును అందుకున్నాడు.అలాగే బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ ,బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ కేటగిరిలో అవార్డులను అందుకుంది..

నేషనల్ ఫిల్మ్ అవార్స్ లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఘాజీ సినిమా నిలిచింది.షూజీ సినిమా నిర్మాత పొట్లూరి వరప్రసాద్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నాడు.సబ్ మెరైన్ యుద్ద నౌక స్టోరీ తో వచ్చిన ఘాజీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.సంకల్ప రెడ్డి దర్శకత్వం అందించిన ఈసినిమాలో రానా ప్రధాన పాత్రపోషించాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ నటిగా దివంగత నటి శ్రీదేవి ఎంపికైంది.మామ్ సినిమాకు గాను శ్రీదేవి పేరు ప్రకటించారు.శ్రీదేవి తరఫున ఉత్తమనటి అవార్డును ఆమె భర్త బోనీ కపూర్‌ ,కూతుళ్లు జాన్వి, ఖుషి కపూర్లు అందుకున్నారు.అవార్డు అందుకున్న సందర్భంగా శ్రీదేవి ఫ్యామిలీ ఉద్వేగానికి గురైయ్యారు.

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహమన్ నేషనల్ ఫిల్మ్ అవార్డును అందుకున్నాడు.తమిళ సినిమాలోని కాట్రువెలియిదై పాటకు గాను,,.హిందీ మామ్ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు గాను రెండు కేటగిరిలలో రెహమన్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్మాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రధానం చేశారు.సీనియర్ నటుడు వినోద్ ఖన్నాను ఫాల్కే అవార్డుకు ఎంపిక చేశారు.ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా వినోధ్ ఖన్నా తనయుడు అక్షయ్ ఖన్నాఅందుకున్నాడు. 65వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవం వివాదాస్సదమైంది.ప్రెస్టిజియస్ గా భావించే ఈ కార్యక్రమానికి రాష్టపతి కొన్ని కేటగిరిలకు మాత్రమే తన చేతులు మీదుగా అవార్డ్స్ ఇస్తానని అనడంతో..మిగతా అవార్డ్ విన్నర్స్ అసంత్రుప్తికి లోనయ్యారు.దీంతో అవార్డులు తీసుకోకుండా కార్యక్రమాన్ని బైకాట్ చేశారు.దాదాపు 68మంది అవార్డ్ విన్నర్స్ ఈ కార్యక్రమాన్నిబహిష్కరించారు.

English Title
national awards teleugu movies

MORE FROM AUTHOR

RELATED ARTICLES