సంచలన నిర్ణయం తీసుకున్న మంత్రి నారా లోకేష్..

సంచలన నిర్ణయం తీసుకున్న మంత్రి నారా లోకేష్..
x
Highlights

ఆంధ్రప్రదేశ ఐటీ మరియు పంచాయితీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లోకి కచ్చితంగా రావాలని...

ఆంధ్రప్రదేశ ఐటీ మరియు పంచాయితీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లోకి కచ్చితంగా రావాలని నిర్ణయించారు. నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి 'వచ్చే ఎన్నికల్లోనే పోటీ చేస్తానని.. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే .. అక్కడి నుంచి పోటీ చేస్తానని అన్నారు. ఐదేళ్లు పాలించమని ప్రజలు తీర్పునిచ్చారన్న అయన.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అయితే లోకేష్ వ్యాఖ్యలను వైసీపీ తిప్పికొడుతోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలకునుంటే ఎమ్మెల్సీ అయ్యి మంత్రి.. ఎందుకయ్యాడని ప్రశ్నింస్తున్నారు. ఇదిలావుంటే నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో చిత్తూర్ జిల్లా చంద్రగిరి లేదా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశమున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే చంద్రగిరి టీడీపీ ఇంచార్జ్ పదవికి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రాజీనామా చేశారు. ఆమె ఇంచార్జ్ గా కొనసాగలేనని తేల్చి చెప్పడంతో మంత్రి లోకేష్ అక్కడ పోటీ చేయడానికి సిద్దమయినట్టు తెలుస్తోంది. ఇక తిరుపతిని మాత్రం ఒక ఆప్షన్ గా పెట్టుకున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories