చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటించిన లోకేశ్

చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటించిన లోకేశ్
x
Highlights

ప్రతి ఏడాది ఆస్తుల వివరాలను ప్రకటిస్తూ వస్తున్న చంద్రబాబు కుటుంబం ఈ సారి కూడా అదే పంథాను కొనసాగించింది. కుటుంబ ఆస్తుల వివరాలను పంచాయతీ శాఖామంత్రి...

ప్రతి ఏడాది ఆస్తుల వివరాలను ప్రకటిస్తూ వస్తున్న చంద్రబాబు కుటుంబం ఈ సారి కూడా అదే పంథాను కొనసాగించింది. కుటుంబ ఆస్తుల వివరాలను పంచాయతీ శాఖామంత్రి లోకేష్‌ వెల్లడించారు. రాజకీయాల్లో ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలనీ, అందుచేతే తెలుగుదేశం అధికారంలో ఉన్నా, లేకున్నా ఆస్తుల వివరాలు ప్రకటిస్తూనే వస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా, చంద్రబాబు కుటుంబం తమ ఆస్తుల వివరాలను ప్రకటించడం ఇది ఎనిమిదోసారి.

ఆస్తుల వివరాలు:

చంద్రబాబు పేరు మీద ఉన్న ఆస్తుల విలువ 2.9 కోట్లు

నారా భువనేశ్వరి ఆస్తుల విలువ రూ. 31.01 కోట్లు

నారా లోకేష్‌ ఆస్తి వివరాలు రూ. 21.40 కోట్లు

నారా బ్రాహ్మణి ఆస్తి విలువ రూ. 7.72 కోట్లు

హెరిటేజ్‌ ఆస్తుల నికర లాభం రూ. 60.38 కోట్లు

హైదరాబాద్‌లో ఇంటి విలువ రూ.8 కోట్లు

నారావారిపల్లెలో నివాసం విలువ రూ. 23.83 లక్షలు

నారా దేవాన్ష్‌ ఆస్తి విలువు రూ. 18.71 కోట్లు

నిర్వాణ హోల్డింగ్స్‌ నికర ఆస్తులు రూ. 6.83 కోట్లు

చంద్రబాబు అప్పులు రూ.5.31 కోట్లు

భువనేశ్వరి అప్పులు రూ. 22.35 కోట్లు

నారా లోకేష్‌ అప్పులు రూ. 5.88 కోట్లు

బ్రాహ్మణి అప్పులు రూ. 5.66 కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories