కేసీఆర్ వ్యాఖ్యలకు నారా లోకేష్ కౌంటర్!

Submitted by arun on Sun, 01/21/2018 - 12:39
Nara Lokesh

ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణకు, ఏపీకి మధ్య పోలికే లేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దేశంలోనే తొలి స్థానానికి ఎదుగుతామని ఆయన అన్నారు. స్వాతంత్ర్యానికి ముందు నుంచే తెలంగాణ సంపన్న రాష్ట్రమని చెప్పారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు, ఏపీకి మధ్య పోలిక లేదనే విషయం నిజమే కదా అని... ఏపీకి కియా మోటార్స్, హీరో మోటార్స్, అపోలో టైర్స్, ఏషియన్ పెయింట్స్ వచ్చాయని... తెలంగాణలో ఆ పరిస్థితి లేదని సెటైర్ వేశారు. 

ఏపీకి బడా కంపెనీలు తరలి వస్తున్నాయని, భారీ పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. శనివారం ఢిల్లీలో పర్యటించిన మంత్రి లోకేష్ కేంద్ర మంత్రి తోమర్‌ను కలిశారు. పెండింగ్ ఉపాధి బిల్లులను విడుదల చేయాలని కోరారు. ఉపాధి హామీతో గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమాలపై నివేదికను కేంద్రమంత్రికి అందజేశారు. విశాఖపట్నంలో అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల సమావేశం నిర్వహించాలని సూచించారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు లోకేష్ తెలిపారు. కేంద్రమంత్రితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేష్.. ఆధార్ అనుసంధానంతో పథకాల్లో దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందన్నారు. నెల రోజుల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు.

English Title
Nara Lokesh counter to CM KCR

MORE FROM AUTHOR

RELATED ARTICLES