నానిలోని ‘కృష్ణ’ వచ్చేసాడు

Submitted by arun on Sun, 01/14/2018 - 12:52
nani

నేచురల్‌ స్టార్‌ నాని కొత్త చిత్రం కృష్ణార్జున యుద్ధం చిత్ర ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయ్యింది. భోగి పండుగ కానుకగా ఈ చిత్రంలోని కృష్ణుడు పాత్ర లుక్కును విడుదల చేశారు. లాస్ట్ ఇయర్ నేను లోకల్ - నిన్ను కోరి - ఎంసి ఎ తో హ్యాపీగా క్లోజ్ చేసిన నాని ఈ సంవత్సరం తన ఇన్నింగ్స్ కృష్ణార్జున యుద్ధంతో మొదలు పెట్టబోతున్నాడు దీని ప్రమోషన్ లో భాగంగా భోగి పండగను పురస్కరించుకుని ఇందులో కృష్ణ లుక్ ని విడుదల చేసారు. కృష్ణ - అర్జున్ గా నాని ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి పాత్ర కృష్ణను రివీల్ చేసిన యూనిట్ గెటప్ లోనే పాత్ర స్వభావాన్ని చెప్పే ప్రయత్నం చేసారు.

గత చిత్రాల కంటే కాస్త భిన్నమైన పాత్రలోనే నాని నటించబోతున్నాడని పోస్టర్‌ చూస్తే అర్థమౌతోంది. వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ రాజా చిత్రాలతో సక్సెస్‌లు అందుకున్న మేర్లపాక గాంధీ కృష్ణార్జున యుద్ధం చిత్రానికి దరకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్‌, రుష్కర్‌ మీర్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. హిప్‌హాప్‌ తమీజ్‌(ధృవ ఫేమ్‌) సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక సంక్రాంతి సందర్భంగా రేపు అర్జున్‌ పాత్ర లుక్కును విడుదల చేయబోతున్నారు. వేసవిలో కృష్ణార్జున యుద్ధం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
 

English Title
Nani Krishna First Look from Krishnarjuna Yudham

MORE FROM AUTHOR

RELATED ARTICLES