ఇష్టమైనదే ప్రాణం తీసింది..

ఇష్టమైనదే ప్రాణం తీసింది..
x
Highlights

నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. 1956...

నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. 1956 సెప్టెంబర్ 2 న కృష్ణా జిల్లా నిమ్మకూరులో నందమూరి తారకరామారావు, బసవతారకం దంపతులకు హరికృష్ణ జన్మించారు. హరికృష్ణ బాల్యం, విద్యాబ్యాసం, వివాహం అన్నీ నిమ్మకూరులోనే జరిగాయి. బాల నటుడిగా రంగప్రవేశం చేసిన హరికృష్ణ హీరోగా, నిర్మాతగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలు పోషించారు. బెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నందిఅవార్ట్‌ కూడా అందుకున్నారు. మొదటగా ‘శ్రీకృష్ణావతారం’ సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఈ చిత్రం1964లో విడుదలైంది. ఈ చిత్రంలో హరికృష్ణ చిన్ని కృష్ణుని పాత్రలో కనిపించారు. అనంతరం ‘తాతమ్మ కల’, ‘రామ్‌ రహీమ్‌’ చిత్రాల్లో సోదరుడు బాలకృష్ణతో కలిసి నటించారు. ఆ తర్వాత తండ్రి తారకరామారావు నిర్మాణ సారధ్యంలో 1977లో వచ్చిన ‘దానవీరశూరకర్ణ’ చిత్రంలో అర్జునుడి పాత్రలో కనిపించారు. ఆ సినిమా తరువాత 1 హరికృష్ణ మరే చిత్రంలో నటించలేదు. 1980 సమయంలో ఎన్‌టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో.. హరికృష్ణ ఆయన వెన్నెంటే ఉన్నారు. ఎన్టీఆర్‌ ప్రచార వాహనం చైతన్య రథాన్ని హరికృష్ణ నడిపించారు.

కాగా తండ్రి ఎన్టీఆర్ మరణాంతరం హరికృష్ణ సినిమాల్లోకి పునరాగమనం చేశారు. 1998లో మోహన్‌బాబు హీరోగా వచ్చిన ‘శ్రీరాములయ్య’ చిత్రంలో హరికృష్ణ ‘కామ్రెడ్‌ సత్యం’ పాత్రలో కీలక కనిపించారు. ఆ తరువాత ఫ్యామిలీ చిత్రాలు 'లాహిరి లాహిరి లాహిరిలో ', ‘శివరామ రాజు’ చిత్రాల్లో నటించారు. 'లాహిరి లాహిరి లాహిరిలో' చిత్రంలో హరికృష్ణ నటనకు గాను నంది అవార్డు అందుకున్నారు. 2003లో వచ్చిన ‘సీతయ్య’, ‘టైగర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌’ చిత్రాల్లో హీరోగా నటించారు హరికృష్ణ. ‘సీతయ్య’ చిత్రంలో హరికృష్ణ చెప్పిన 'ఎవరి మాట వినడు సీతయ్య' గుర్తుండిపోయే డైలాగ్ అని చెప్పాలి. అనంతరం ‘స్వామి’, ‘శ్రావణమాసం’ చిత్రాల్లో నటించారు. ఇక రాజకీయాల్లోకి 1983 లో ప్రవేశించిన హరికృష్ణ 1996-99 లో ఎమ్మెల్యేగా పనిచేశారు. 1996లో రవాణా మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సేవలు అందించారు. ఆపై 2008లో టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక ఆయిన హరికృష్ణ ప్రస్తుతం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. హరికృష్ణకు ఇద్దరు భార్యలు.. ముగ్గురు కుమారులు కాగా పెద్ద కుమారుడు జానకీరామ్‌ నాలుగేళ్ల క్రితం ఇదే నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. కల్యాణ్‌ రామ్‌, జూ. ఎన్టీఆర్‌ ఇద్దరూ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా రాణిస్తున్నారు. హరికృష్ణకు ఇష్టమైన వాటిలో డ్రైవింగ్ కూడా ఒకటి. అయితే ఆ డ్రైవింగ్ కారణంగానే సీతయ్య ప్రాణాలు వదిలారు.

Show Full Article
Print Article
Next Story
More Stories