నల్లగొండ నడుమ నడుస్తున్న రాజకీయ చరిత్ర

నల్లగొండ నడుమ నడుస్తున్న రాజకీయ చరిత్ర
x
Highlights

ఉమ్మడి నల్లగొండ జిల్లా కూటమి ఆశావహులను టిక్కెట్ల భయం వెంటాడుతుంది. పొత్తుల్లో భాగంగా తాము ఏమైపోతామోనన్న బెంగ పట్టుకుంది. టీఆర్ఎస్‌ అభ్యర్థులు...

ఉమ్మడి నల్లగొండ జిల్లా కూటమి ఆశావహులను టిక్కెట్ల భయం వెంటాడుతుంది. పొత్తుల్లో భాగంగా తాము ఏమైపోతామోనన్న బెంగ పట్టుకుంది. టీఆర్ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే... తాము ఏం చేయాలో తెలియక కూటమి నేతలు కుంగిపోతున్నారు. పైకి చెప్పుకోలేక... బయటపడలేక, కార్యకర్తలకు నచ్చచెప్పలేక, అభిమానులను సముదాయించలేక... తాము ఒత్తిడికి గురవుతున్నామని చెబుతున్నారు. ఇంతకీ వాళ్ల భయమేంటి? పొత్తులు, పై ఎత్తుల నల్లగొండ రాజకీయాన్ని ఎటువైపు నడిపించబోతున్నాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో 10 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించింది. కోదాడ, హుజుర్‌నగర్‌కు మాత్ర అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ రెండు నియోజకవర్గాలపైనే టీఆర్ఎస్ నేతలు టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్‌తో జట్టుకడుతున్న టీడీపీ, సీపీఐ, సీపీఐ, జనసమితి, తెలంగాణ ఇంటి పార్టీలకు చెందిన నేతలు తమకు టికెట్ వస్తుందో లేదో అంచనాల్లో ఉన్నారు. మహాకూటమి తరపున నల్లగొండ, నాగార్జునసాగర్, హుజుర్‌నగర్, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. కోదాడలో టీపీసీీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పద్మావతి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ నుంచి టికెట్ కోసం టీడీపీ తరపున బొల్లం మల్లయ్య యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. తనకే టికెట్ వస్తుందని అనుచరులకు, కార్యకర్తలకు మనోధైర్యం ఇస్తున్నారు. కోదాడతో పాటు పొత్తుల్లో సీట్ల కోసం పోటీ ఉన్న నకరికల్, తుంగతుర్తి, మునుగోడులలోనూ ఇదే పరిస్ధితి.

నకరికల్ లేదా తుంగతుర్తి లో తెలంగాణ ఇంటిపార్టీ తరపున చెరుకు సుధాకర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ కూడా ఈరెండింటిలో ఒక సీటు కావాలని డిమాండ్ చేస్తుంది. దీంతో ఇక్కడ టికెట్ కోసం పాల్వాయి రజనీకుమారి తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తనకే టికెట్ కన్పామ్ అవుతుందని ఆమె అనుచరులకు చెప్పుకోస్తుంది. ఇక నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన ప్రయత్నాలు చేస్తునే ...టికెట్ తనకేనని కార్యకర్తలకు చెప్పుకోస్తున్నారు. తుంగతుర్తిలో అద్దంకి దయాకర్, గుడిపాటి నర్సయ్య, వడ్డేపల్లి రవి, జ్ణానసుందర్‌లు ఎవరికి వారే కాంగ్రెస్ టికెట్ వస్తుందని అనుచరులకు సమాచారం ఇస్తున్నారు. ఇక మునుగోడులో పంచాయతీ పిక్ స్టేజ్‌కు చేరింది. కాంగ్రెస్ టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, తనకు టికెట్ వచ్చిన రాకపోయినా మునుగోడు పోటీ తప్పదని ఇప్పటికే కార్యకర్తలతో మీటింగుల్లోనే చెప్పారు. ఇక పాల్వాయి స్రవంతి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. దీనికి భిన్నంగా సీపీఐ మునుగోడు టికెట్ కావాలని గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఇక్కడ నుంచే ఓయూ జేఏసీ నేత కైలాస్ నేతతో పాటు నారబోయిన రవి కాంగ్రెస్ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఇక నల్లగొండ జడ్పీఛైర్మన్‌ బాలునాయక్ దేవరకొండ టికెట్ హామీతోనే కాంగ్రెస్‌లో చేరానని చెప్పుకొస్తున్నారు. అయితే ఈసీటు సీపీఐ పొత్తుల్లో భాగంగా అడుగుతున్నట్లు సమాచారం.

ఇక హాట్ హాట్‌గా ఉన్న సీట్లలో మిర్యాలగూడ ఒకటి. ఇక్కడ నుంచి జానారెడ్డి ఈసారి పోటికి దిగుతారని ...ఆయన కొడుకు రఘువీర్ సాగర్ నుంచి పోటి చేస్తారని ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఇద్దరు మాత్రం రెండు నియోజకవర్గాల సీట్ల కోసం ప్రయత్నం అయితే జరుగుతుంది. మిర్యాలగూడ సీటును టీడీపీ, తెలంగాణ జనసమితి అడుగుతున్నప్పటికీ వారికి సరైన బలం లేకపోవడంతో జానా కుటుండానికే టికెట్ అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేదంటే ఇదే ప్రాంతానికి చెందిన బీసీ నేత దాసోజు శ్రావణ్ పోటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక సూర్యాపేటలో కూడా టికెట్ కాంగ్రెస్‌కే అవకాశం ఉన్న తెలంగాణ జనసమితి అడుగుతుంది. కాంగ్రెస్ నుంచి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డిలు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories