జెండా గద్దెపై వ్యక్తి తల...

Submitted by arun on Mon, 01/29/2018 - 11:20

నల్లగొండ జిల్లా బొట్టుగూడలో కలకలం చెలరేగింది. ఓ వ్యక్తిని చంపి అతి కిరాతకంగా తలను మొండెం నుంచి వేరు చేశారు. అంతటితో కసి తీరక తలను ఓ జెండా దిమ్మపై పెట్టి వెళ్లారు హంతకులు. హతుడిని కనగల్ కి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పాలకురి రమేష్ గా గుర్తించారు. రాత్రి టాబ్లెట్స్ కోసం రమేష్ బయటికి వెళ్లిన సమయంలో ఈ హత్య జరిగి ఉంటుందని చెబుతున్నారు. భార్యతో కలహాలే హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతి దారుణంగా కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని చూసినవారు భయకంపితులవుతున్నారు.


 

English Title
Nalgonda man murder

MORE FROM AUTHOR

RELATED ARTICLES