ముస్లిం బాలికలు నెయిల్ పాలిష్ వాడరాదని యూపీలో ఫత్వా జారీ

ముస్లిం బాలికలు నెయిల్ పాలిష్ వాడరాదని యూపీలో ఫత్వా జారీ
x
Highlights

యూపీలోని 'దారూల్ ఉలూమ్ దియోబంద్' అనే సంస్థ సంచలన ప్రకటన చేసింది. ఇకపై ముస్లిం యువతులు, బాలికలు ఎవరూ కూడా తమ గోళ్లకు నెయిల్ పాలిష్ పూసుకోరాదని ఆ సంస్థ...

యూపీలోని 'దారూల్ ఉలూమ్ దియోబంద్' అనే సంస్థ సంచలన ప్రకటన చేసింది. ఇకపై ముస్లిం యువతులు, బాలికలు ఎవరూ కూడా తమ గోళ్లకు నెయిల్ పాలిష్ పూసుకోరాదని ఆ సంస్థ ఫత్వా జారీ చేసింది. అయితే గోళ్లపై మెహందీ పూసుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని సంస్థ స్ఫష్టం చేసింది. ఇస్లామ్ సూత్రాల ప్రకారం గోళ్లకు రంగు పూసుకోవడం నిషేధమని సంస్థ పేర్కొంది. గతంలో కూడా ఇదే సంస్థ ఇలాంటి వివాదాస్పదమైన ఫత్వాలు జారీ చేసి వార్తలలో నిలిచింది. ముస్లిం స్త్రీలు తమ కనుబొమ్మలను షేపింగ్ చేసుకోరాదని, అలాగే జుట్టు కత్తిరించుకోవడం కూడా నిషేధమని ఫత్వా జారీ చేసింది.

అలాగే ముస్లిం యువతులు సాధ్యమైనంత వరకూ బ్యూటీ పార్లర్లకు వెళ్లడం బంద్ పెట్టాలని, బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం గొప్పదనే విషయాన్ని వారు తెలుసుకోవాలని సంస్థ గతంలో తెలిపింది. కొందరు ముస్లిం స్త్రీలు ఎక్కువగా మేకప్ వేసుకుంటూ ఉంటారని అలా మేకప్ వేసుకోవడం వల్ల పురుషులు ఆకర్షితులవుతారని అటువంటి మేకప్ వేసుకోవడం ఇస్లామ్ ప్రకారం నిషిద్ధమని కూడా గతంలో దారూల్ ఉలూమ్ దియోబంద్ తెలియజేయడం గమనార్హం.

కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఆంక్షలే ముస్లిం పురుషులకు కూడా ఈ సంస్థ విధించింది. ఇస్లామ్ ప్రకారంగా పురుషులు షేవింగ్ చేసుకోరదని గతంలో ఈ విషయాన్ని కూడా తాము సీరియస్‌‌గా తీసుకున్నామని దారూల్ ఉలూమ్ దియోబంద్ సంస్థ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories