నన్ను సినిమాల్లోకి తీసుకువచ్చింది ఆమె : అక్కినేని నాగార్జున

Submitted by nanireddy on Wed, 05/02/2018 - 09:28
mahanati audio funtion

అలనాటి మహానటి జీవిత చరిత్ర ఆధారంగా రోపొందుతున్న 'మహానటి' చిత్రంలో తాను లేకపోయానని కొంత అసంతృప్తి  ఉంది. కానీ తన కోడలు కొడుకు, సినిమాలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని హీరో అక్కినేని నాగార్జున అన్నారు. మే 1న జరిగిన మహానటి ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ వేడుకకు అక్కినేని నాగార్జున హజారయ్యారు. ఈ సందర్బంగా సావిత్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సావిత్రి గారు వెలుగునీడలు  సినిమాలో నటిస్తున్నసమయంలో తనకు ఎనిమిది నెలల వయసు.. అప్పుడే తనను వెండి తెరకు సావిత్రి గారు పరిచయం చేశారని అన్నారు. తనకు చిన్నవయసులో పెద్దలంటే ఒకరకమైన భయమని అందుకు ఉదాహర.. ఒకరోజు మా ఇంటికి సావిత్రి గారు వచ్చారు ఆమె ముద్దుగా  తన వద్దకు రమ్మని పిలుస్తున్నా నేను వెళ్ళలేదు భయంతో నాన్న వెనకాలే దాక్కున్నానని నాగ్ చెప్పారు. మహానటి సినిమాను ఇద్దరు ఆడవాళ్లు నిర్మించారన్న అయన సినిమా సూపర్ హిట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మహానటి ఆడియో ఫంక్షన్ కు.. jr ఎన్టీఆర్ తోపాటు బాలకృష్ణ , అక్కినేని సమంత , దర్శకుడు కోవెలమూడి రాఘవేందర్ రావు దర్శకుడు నాగ్ అన్వేష్, అశ్విని దత్ కుటుంబసభ్యులు,  తదితరులు పాల్గొన్నారు.

English Title
nagarjuna talking about mahanati savitri

MORE FROM AUTHOR

RELATED ARTICLES