కత్తి మహేష్ ను వదిలే ప్రసక్తే లేదు: నాగబాబు వార్నింగ్

Submitted by arun on Wed, 07/04/2018 - 12:37
kathi

రాముడి గురించి తప్పుగా మాట్లాడి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కత్తి మహేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మెగా బ్రదర్ నాగబాబు డిమాండ్ చేశారు. మత విశ్వాసాలను కించపరిచేలా మట్లాడితే, హిందువులు ఊరుకోరని నాగబాబు హెచ్చరించారు. రామాయణం ఒక పుస్తకం కాదని, హిందువులు ఆరాధించే చరిత్ర అని తెలిపారు. క్రైస్తవులకు బైబిల్, ముస్లింలకు ఖురాన్ ఎలాగో హిందువులకు రామాయణం, మహాభారతం కూడా అలాంటివేనని పేర్కొన్నారు. నాస్తికత్వం పేరుతో మత విశ్వాసాలను తప్పుబడుతూ మాట్లాడితే ఊరుకోం. హిందూ మతవిశ్వాసాలపై ప్లాన్ ప్రకారం దాడి చేస్తున్నారు. మతపరమైన చర్యలను ఎవరూ ప్రోత్సహించకండి'' అంటూ సూచించారు. అలానే కత్తి మహేష్ పై రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోతే.. ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సివస్తుందని అన్నారు. 

English Title
nagababu fires on katthi mahesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES