చిన్నారి నాగవైష్ణవి కేసులో కోర్టు తీర్పు ఇది...

Submitted by arun on Thu, 06/14/2018 - 14:18
Naga Vaishnavi case

విజయవాడ నాగవైష్ణవి హత్యకేసులో తుది తీర్పు వెలువడింది. నిందితులకు జీవితఖైదు విధించారు. మహిళా సెషన్స్ కోర్టు ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ విజయవాడ కోర్టు తీర్పు ఇచ్చింది. కేసులో ఏ-1 మోర్ల శ్రీనివాసరావు, ఏ-2 జగదీష్, ఏ-3 పలగాని ప్రభాకర్‌రావు బావమరిది పంది వెంకటరావు గౌడ్.. ఈ ముగ్గురికీ కోర్టు జీవిత ఖైదు విధించింది.

విజయవాడకు చెందిన బీసీ నాయకుడు పలగాని ప్రభాకర్‌ కుమార్తె నాగవైష్ణవి 2010 జనవరి 30న కారులో పాఠశాలకు వెళుతుండగా దుండగులు అడ్డగించి డ్రైవరును హతమార్చి వైష్ణవిని కిడ్నాప్ చేశారు. రెండు రోజుల పాటు తీవ్ర గాలింపుల అనంతరం, గుంటూరు శివార్లలోని ఆటోనగర్‌లోని ప్లాట్ నెంబరు 445లో చిన్నారి శవం లభ్యమైంది. అభం శుభం తెలియని చిన్నారిని వేధింపులకు గురిచేసి, అనంతరం బాయిలర్‌లో వేసి బాలికను కాల్చి చంపినట్లులో పోలీసులు గుర్తించారు.

ప్రభాకర్‌పై కోపంతో ఆయన మొదటి భార్య వెంకటేశ్వర్వమ్మ తమ్ముడు పంది వెంకట్రావు ఈ హత్యకు కట్ర పన్నిట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా మెర్ల శ్రీనివాసరావు, ఏ2గా వెంపరాల జగదీష్, ఏ3గా పంది వెంకట్రావు అలియాస్‌ కృష్ణ ఏడేళ్లుగా జైలులో రిమాండ్‌లోనే ఉన్నారు. నిందితులకు బెయిల్‌ మంజూరు చేయకుండానే కేసు విచారణ పూర్తి చేశారు. వారిపై ఐపీసీ 302, 307, 364, 201,427, 379, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చార్జిషీట్‌ దాఖలు చేశారు.

వైష్ణవి హత్య వార్త తెలియడంతో బాలిక కుటుంబం షాక్‌కు గురైంది. తన గారాలపట్టి హత్యకు గురైందన్న విషయం తెలసుకొని ప్రభాకర్‌ పుత్రికా శోకంతో కన్నుమూశారు. దాంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆస్తి కోసం సొంతవారే చిన్నారిని దారుణంగా హతమార్చడంపై ప్రజాసంఘాలు నిరసనకు దిగాయి. నిందితలను కఠింగా శిక్షించాలంటూ ఆందోళనలు చేశారు.
 

English Title
Naga Vaishnavi case Fast Track Court gave judgement

MORE FROM AUTHOR

RELATED ARTICLES