బ్రేకింగ్ : జనసేనలో చేరనున్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్

Submitted by nanireddy on Thu, 10/11/2018 - 12:19
Nadendla Manohar To Join Janasena Party Today in Tirupati

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.తిరుపతిలో ఇవాళ(గురువారం) సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గతకొంత కాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న మనోహర్.. రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్ రావు తనయుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన మనోహర్.. గుంటూరు జిల్లా తెనాలి నుంచి  రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2011 నుంచి 2014 వరకు శాసనసభలో స్పీకర్ గా పనిచేశారు.  వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున తెనాలి అసెంబ్లీకి పోటీచేసేందుకు అయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  

English Title
Nadendla Manohar To Join Janasena Party Today in Tirupati

MORE FROM AUTHOR

RELATED ARTICLES