“ నాటకం” సినిమా పండిందా?

“ నాటకం” సినిమా పండిందా?
x
Highlights

హైదరాబాద్ ట్యాంక్బండ్ మీద... పల్లీలు, బొంగులు..శనగలు..ఉల్లిపాయ.. అవి కొంచం.. ఇవి కొంచెం కలిపి పొట్లంగా చేసి అమ్ముతుంటారు... అలాగే.. నాటకం సినిమా...

హైదరాబాద్ ట్యాంక్బండ్ మీద... పల్లీలు, బొంగులు..శనగలు..ఉల్లిపాయ.. అవి కొంచం.. ఇవి కొంచెం కలిపి పొట్లంగా చేసి అమ్ముతుంటారు... అలాగే.. నాటకం సినిమా దర్శకుడు...”కల్యాణజి గొనగ” ఈ మద్య కాలంలో వచ్చి బాగానే నడిచిన సినిమాలైన ..... అర్జున్ రెడ్డి.., RX100, అలాగే ఆమధ్య వచ్చిన ఖాకి , దండుపాళ్యం నుండి... అవి కొంచం.. ఇవి కొంచం కలిపి ముంత పల్లి పొట్లంలా “ నాటకం” సినిమా నడిపించాడు అనిపించింది. ఈ సిన్మాలో అశిశ్ గాంధీ, అశిమా నర్వల జంటగా కలిపి, మరి కొన్ని పాత్రలతో పొట్లం కట్టబడిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ నాటకం.. అశిశ్ గాంధి హీరోగా చేసిన ఈ తొలి ప్రయత్నం ఆయనకు కొంత పేరు తీసుకు వస్తుది, తమిళ హీరోలా గడ్డం పెంచుకొని.. సినిమాలో తన నటనతో, మ్యానరిజమ్స్ తో.. అశిశ్ గాంధీ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. దర్శకుడు కల్యాణజి గొనగ రాసిన కొన్ని ఎమోషనల్ సీన్స్ తో పాటు కథలో ముఖ్యమైన కొన్ని కీలక సన్నివేశాలు బాగున్నప్పటికీ.. మొత్తం మీద ఈ ‘నాటకం ‘ చిత్రంలో ముఖ్య కథకి రుచి పెంచని కరక్కాయ లాంటి సీన్లు , లాగ్ చేస్తూ...వాటిని కూడా ఈ పోట్లంలోనే, కలిపాడు.. అలాగే శృంగారం యొక్క మసాలా ఘాటు ఎక్కువ ఈ పోట్లంలో వేయటం వాళ్ళ ఫ్యామిలీ ఆడియన్స్కి దూరం అయ్యాడు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories