శ్రీదేవి మృతిలో మిస్టరీ..బాత్‌టబ్‌లో పడిందా? తోసేశారా?

శ్రీదేవి మృతిలో మిస్టరీ..బాత్‌టబ్‌లో పడిందా? తోసేశారా?
x
Highlights

ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌లో మునిగి శ్రీదేవి చనిపోయిందని దుబాయ్‌ వైద్యులు ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ ఇచ్చారు. అయితే ఈ నివేదికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి....

ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌లో మునిగి శ్రీదేవి చనిపోయిందని దుబాయ్‌ వైద్యులు ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ ఇచ్చారు. అయితే ఈ నివేదికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాత్‌ టబ్‌లో శ్రీదేవి ప్రమాదవశాత్తు మునిగిపోయిందా...లేదంటే ఎవరైనా ముంచేశారా?

ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడి చనిపోయిందని రిపోర్ట్‌
ఫోరెన్సిక్‌ నివేదికపై అనేక అనుమానాలు
కేసును పునర్విచారణ చేస్తున్నట్టు ప్రకటించిన పోలీసులు
బోనీకపూర్‌ను మూడు గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు
శ్రీదేవి, బోనీకపూర్‌ల కాల్‌ డేలా పరిశీలన
శ్రీదేవి మృతి కేసు పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు అప్పగింత

అందాలతార శ్రీదేవి మృతి వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. పోస్ట్ మార్టం నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. శ్రీదేవి కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూయలేదనీ ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో పడి చనిపోయినట్లు తేలింది. శనివారం డిన్నర్ కు రెడీ అవడానికి బాత్ రూంకి వెళ్ళిన శ్రీదేవి బాత్ రూమ్ లో జారిపడిపోయింది. కాలు జారి పక్కనే ఉన్న బాత్ టబ్ లో పడిపోయారు. ఆమె బాత్ టబ్ లో మునిగి పోవడం వల్లే మరణించిందని దుబాయ్ ఆరోగ్య శాఖ నివేదిక తెలిపింది. అయితే అనేక అనుమానాలు ఈ రిపోర్ట్‌పై వ్యక్తమవుతున్నాయి అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి.

హడావుడిగా దుబాయ్‌ వైద్యులు ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ ఇచ్చారా?
ప్రమాదవశాత్తు అని అప్పుడే తేల్చడమేంటి?
Drowining అంటే Drawning అని స్పెల్లింగ్‌ తప్పు
డ్రౌనింగ్‌ అంటే మునిగిపోవడం
హడావుడిగా రిపోర్ట్ ఇవ్వడం వల్లే స్పెల్లింగ్ తప్పులా?
ఘటన జరిగిన సమయంలో రూంలో ఎవరున్నారు?
భర్త బోనీ కపూర్‌ హోటల్‌లోనే ఉన్నాడా...ముంబైలోనా?
బాత్రూమ్‌లో శ్రీదేవి భౌతిక కాయాన్ని మొదట గుర్తించిందెవరు?
ఇంతవరకూ కుటుంబ సభ్యులు ఎందుకు నోరువిప్పలేదు?
మత్తులో శ్రీదేవి తనంతటా తానే బాత్‌ టబ్‌లో పడిపోయారా?
లేదంటే ఎవరైనా ఆమెను తోసేశారా?
కేవలం టబ్‌లో పడిపోతే చనిపోతారా?
మొదట గుండెపోటు అని బంధువులు ఎందుకు చెప్పారు?
మృతికి కారణాలపై అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఏంటి?

ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి..అంతేకాదు, ఈసాయంత్రానికి ముంబైకి మృతదేహాన్ని తరలిస్తారని అనుకుంటే, మరింత ఆలస్యం చేస్తున్నారు. ఎందుకంటే, శ్రీదేవి మరణంపై అనుమానాలు పెరగడమే కారణం. మొదట గుండెపోటు అని వార్తలు రావడం, తర్వాత ప్రమాదవశాత్తు టబ్‌లో మునిగిచనిపోయిందని చెప్పడంతో సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో కేసును పునర్విచారణ చేస్తున్నట్టు ప్రకటించారు దుబాయ్ పోలీసులు. ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌పై ఫ్యామిలీ ఫ్రెండ్, అమర్‌ సింగ్‌ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో, ఈ కేసులో కీలకమైన వ్యక్తి భర్త బోనీకపూర్. ఫోరెన్సిక్ రిపోర్ట్ చేతికందిన తర్వాత, దాదాపు మూడు గంటలపాటు కపూర్‌ను ప్రశ్నించారు పోలీసులు. ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. శ్రీదేవితో పాటు బోనీకపూర్‌ కాల్‌డేటాను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. మరో ముగ్గుర్ని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. శ్రీదేవి మృతి కేసును పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు అప్పగించారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories