నా స్నేహితుడు చనిపోయాడు కేటీఆర్‌ సర్‌

నా స్నేహితుడు చనిపోయాడు కేటీఆర్‌ సర్‌
x
Highlights

మహానటి సినిమా దర్శకుడు నాగ్ ఆశ్విన్ తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కెటిఆర్‌కు ట్యాగ్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు....

మహానటి సినిమా దర్శకుడు నాగ్ ఆశ్విన్ తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కెటిఆర్‌కు ట్యాగ్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే మహానటి సినిమాలో కెమెరామెన్‌గా పనిచేస్తున్న దర్శకుని స్నేహితుడికి ఆదివారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కెమెరామెన్‌ను హుటా హుటినా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. అక్కడ సరైన సమయానికి ఆసుపత్రికి చేర్చిన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కెమెరామెన్ మృతిచెందాడు. దింతో ఆవేదనతో ఆపద్దర్శ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు ‘మహానటి’ దర్శకుడు నాగ్‌ అశ్విన్ కెటిఆర్ ట్యాగ్ చేస్తూ తన స్నేహితుడి పట్ల చోటుచేసున్న దారుణంపై ఆవేదన వ్యక్తం చేస్తూ వివరించాడు. కాగా ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత మూడు గంటలపాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. ఆదివారం కావడంతో ఒక్కరు కూడా అందుబాటులో లేరు. అతని తల్లిదండ్రులే స్ట్రెచర్‌పై పడుకోబెట్టి మోసుకుంటూ తిరిగారు. ఈ ఆసుపత్రిలో కాకుండా మరిఇంకేదన్న ఆస్పత్రికి తీసుకెళ్లినా నా స్నేహితుడు బతికేవాడు. సరైనా సమయానికి వైద్యం అందక ఎవ్వరూ చనిపోకూడదు’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు అశ్విన్‌. ఈ విషయంపై ఆపద్దర్మ మంత్రి కేటీఆర్‌ స్పందించాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories