మాది థర్డ్‌ ఫ్రంట్ కాదు.. ఫ‌స్ట్ ఫ్రంట్ : మ‌ంత్రి కేటీఆర్

Submitted by lakshman on Sat, 03/10/2018 - 20:41
ktr

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు విఫ‌ల‌మ‌య్యాయ‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమ‌ర్శించారు. భార‌త్ కేవ‌లం రెండు పార్టీల రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌గా ఉండ‌టం స‌రికాద‌ని ఆయ‌న త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఈసంద‌ర్భంగా థర్డ్‌ ఫ్రంట్, ఎన్డీఏ కూటమిపై కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మాది థర్డ్‌ ఫ్రంట్ కాదు.. ఫస్ట్ ఫ్రంట్ అని అన్నారు.  

అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నుంచి చాలా పార్టీలు బయటికొస్తున్నాయ‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, శివసేన వెళ్లిపోయిన తర్వాత కేవలం బలహీన అకాలీదళ్ మాత్రమే ఎన్డీఏలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తోందన్నారు. ఇప్పటికైనా ఎన్డీఏ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయం వ‌చ్చింద‌ని అన్నారు. 

ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు పూర్తి స్థాయి మెజార్టీ సాధించే అవ‌కాశం లేద‌న్నారు. భారతదేశం కేవలం రెండు పార్టీల వ్యవస్థ కాదని.. రెండు పార్టీల మధ్య పోరాటంగా ఉండకూడదన్నారు. ప్రాంతీయ పార్టీలు మరింత బలోపేతం కావాలని కేటీఆర్ ఆక్షాంక్షించారు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని నేపథ్యంలో ఏర్పడే కూటమిని థర్డ్‌ ఫ్రంట్ అని ఎందుకంటారు.. ఫస్ట్‌ ఫ్రంట్ అని అనొచ్చు కదా సూచించారు.  
 

English Title
this is my first front

MORE FROM AUTHOR

RELATED ARTICLES