బీజేపీలో చేరితే మా నాన్నను చంపేస్తారా?

Submitted by arun on Sat, 02/10/2018 - 15:56
school girlfacebook video

కేరళలో ఓ బాలిక వీడియో సంచలనంగా మారింది. సీపీఎం కార్యకర్తల మూలంగా తన కుటుంబానికి ముప్పు పొంచి ఉందని సదరు బాలిక ఓ వీడియోను రికార్డు చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. దీంతో రాజకీయంగా ఒక్కసారిగా పెను దుమారం చెలరేగింది. కేరళ ఉత్తరాదిలో ఒక మారుమూల పంచాయతీ గ్రామంలో సీకే సుకుమారన్ ఇటీవల బీజేపీ సభ్యత్వం పుచ్చుకున్నారు. రెండు పార్టీల్లో అక్కడి జరిగే ఆధిపత్య పోరులో ఇటువంటివన్నీ సర్వసాధారణం. కాకపొతే.. ఈ సుకుమారన్ అనే సన్నకారు కార్యకర్త మీద అక్కడి కమ్యూనిస్టులు కత్తి కట్టేశారు. కత్తీకొడవలి వదిలిపెట్టి కమలంపార్టీలో కూర్చుంటావా.. నీకెన్ని దమ్ములు అంటూ.. బెదిరింపులకు దిగేశారు. నిన్ను, నీ ఫ్యామిలీని అంతం చేస్తామంటూ హెచ్చరికలూ జారీ అయ్యాయి. ఈ మొత్తం వ్యవహారం మీద ఎవ్వరికి ఫిర్యాదు చేస్తే ఏమవుతుందోనని బెంబేలెత్తిపోయిన సదరు బాధితుడు.. బిక్కుబిక్కుమంటూ ఇంట్లో కూర్చుండిపోయాడు. తండ్రి ఆవేదనను దగ్గరినుంచి చూసిన ఆయన కూతురు.. మరో దారిలేక సోషల్ మీడియాను ఆశ్రయించింది. మమ్మల్ని చంపేస్తున్నారు అంటూ ఒక వీడియో చేసి.. బైటికొదిలింది. స్కూల్‌కు వెళ్లాళ్లన్నా తనకు భయంగా ఉందని.. దొడ్డిదారిలో పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని ఆమె వివరించింది. ‘సీపీఎం కార్యకర్తలు నా తండ్రిని చంపేస్తారు.. నా కుటుంబాన్ని రక్షించండి’ అంటూ బాలిక వీడియోలో వేడుకుంది.
 

English Title
my-father-facing-death-threats-from-cpi-after-joining-bjp

MORE FROM AUTHOR

RELATED ARTICLES