మేక తోక గొర్రె మాంసం - మార్కేట్‌లో సరికొత్త మోసం

మేక తోక గొర్రె మాంసం - మార్కేట్‌లో సరికొత్త మోసం
x
Highlights

మార్కేట్‌లో జరుగుతున్న మోసాలను పసిగట్టి వినియోగదారులు అప్రమత్తం అవుతున్న కొద్ది,మోసం చేసే వ్యాపారులు సైతం సరికొత్త రీతిలో ముందుకు...

మార్కేట్‌లో జరుగుతున్న మోసాలను పసిగట్టి వినియోగదారులు అప్రమత్తం అవుతున్న కొద్ది,మోసం చేసే వ్యాపారులు సైతం సరికొత్త రీతిలో ముందుకు వస్తున్నారు.పాలు,నీళ్లు,పప్పు-ఉప్పు అది ఇది అని లేకుండా ఎక్కడ కుదిరితే అక్కడ మోసానికి పాల్పడుతున్నారు.ఇక మాంసం విషయానికి వస్తే ఇంత కాలం నిల్వచేసింది,పాడయిపోయినది కలిపి అమ్మకాలు చేసేవారు.ప్రజలు అప్రమత్తం అవడంతో సరికొత్త దందాకు ఇప్పుడు మార్గం కనిపెట్టారు,అదే గొర్రె కు మేక పోతు తోక తగిలించి ఎక్కువ రేటుకు అమ్మడం.

ఇల్లెందు పట్టణంలో జరిగిన పోలీసు శాఖ చేసిన దాడుల్లో ఈ విషయం బయటపడింది.జగదాంబ సెంటర్ లోని నిసార్ అహ్మద్ కు చెందిన మటన్ షాపులో చేసిన దాడుల్లో ఈ అక్రమ విక్రయం బట్టబయలైంది.నిసార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మూడు వేలు జరిమాన వేశారు.ఇక నుంచి నగరంలో మాంసం విక్రయాలపై తీవ్ర నిఘా ఉంటుందని,ఎవరైన అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ శాఖ అధికారులు,పోలీసులు హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories