పొలిటికల్‌ హిట్‌... మోస్ట్‌ క్రేజీ సీట్‌!!

పొలిటికల్‌ హిట్‌... మోస్ట్‌ క్రేజీ సీట్‌!!
x
Highlights

ఎక్కడా దిక్కులేనోడికి అక్కడే దిక్కు అన్న ప్రచారానికి....కేరాఫ్ అడ్రస్ ముషీరాబాద్‌ నియోజకవర్గం. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్‌‌ నేతలకు. బెల్లం చుట్టూ ఈగలు...

ఎక్కడా దిక్కులేనోడికి అక్కడే దిక్కు అన్న ప్రచారానికి....కేరాఫ్ అడ్రస్ ముషీరాబాద్‌ నియోజకవర్గం. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్‌‌ నేతలకు. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు, శాసనసభ ఎన్నికల వేళ ముషీరాబాద్‌ చుట్టూ చేరిపోతున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఈ నియోజకవర్గం కోసం, హస్తం పార్టీలో పోటీ తీవ్రంగా పెరిగింది. ప్రముఖ నేతల పిల్లలు అదే నియోజివర్గంపై కన్నేశారు. స్థానిక చిన్నా చితక నేతలు సైతం, తమకు అదే స్థానం కావాలని పట్టుబడుతున్నారు.

మాజీ ముఖ్యమంత్రి టంగుటూరు అంజయ్య భార్య మన్నెమ్మ 2009లో, ముషీరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, ఆ కుటుంబం నుంచి రాజకీయ వారసులుగా ఎవ్వరూ నిలదొక్కుకోలేకపోయారు. దీంతో స్థానికేతరులు ఆ నియోజికర్గంపై కన్నేశారు. పార్టీలో కనిపించే ముఖ్యనేతలు, నియోజకవర్గంలో తిరిగే నేతలంతా ముషీరాబాద్‌‌నే టార్గెట్ చేసుకుని అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుంటున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, ముషీరాబాద్‌ స్థానంలో కొంతకాలంగా క్రియాశీలకంగా ఉన్నారు. యూత్‌ అసోసియేషన్లు, చిన్నచిన్న మీటింగ్‌లతో ఉనికి చాటుకుంటున్నారు. తాను ఇక్కడి నుంచే పోటి చేస్తానని చెబుతూ వస్తున్నారు.

ఈయనతోపాటు, గత ఎన్నికల నుంచి ముషీరాబాద్‌ తనకే కావాలంటూ, మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రంగౌడ్ ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికితోడు పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ సైతం, తనకూ ఇదే కావాలంటున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ముషీరాబాద్‌ నియోజికవర్గమైతే, గెలుపు సాధ్యమవుతుందని శ్రవణ్‌, పీసీసీకి చెప్పినట్లు సమాచారం. ఇక సేవాదళ్ కన్వీనర్, పార్టీ సీనియర్ నేత కనుకులు జానార్ధన్ రెడ్డి కూడా ముషీరాబాద్‌ తనకే కేటాయించాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి అంజయ్య మనుమడు అభిషేక్ రెడ్డి, గత ఎన్నికల్లో పోటిచేసిన వినోద్ కుమార్, స్థానికనేత నగేష్ ముదిరాజ్, ఇందిరా శోభన్, వీరితోపాటు హస్తం పార్టీలో తిరిగే చిన్నాచితక నేతలు సైతం ముషీరాబాద్‌ టిక్కెట్టు తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ముషీరాబాద్‌ కోసం, కాంగ్రెస్‌లో పోటాపోటీ సాగుతోంది.

రాజకీయంగా ఎక్కడా దిక్కులేని నేతలంగా ముషీరాబాద్‌పై కన్నేయడంతో, హస్తం పార్టీలో సీనియర్లు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు మహాకూటమిలో, టిడిపికే సీటు వెళుతుందనే ప్రచారం కూడ పార్టీలో ఉంది. ఒకవేళ కాంగ్రెస్సే, సీటును తీసుకుంటే, ఎవరికి దక్కుతుందనేది మాత్రం ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories