బ్యూటిషియన్‌పై దారుణం : కాళ్లు, చేతులు కట్టేసి...

బ్యూటిషియన్‌పై దారుణం : కాళ్లు, చేతులు కట్టేసి...
x
Highlights

కృష్ణా జిల్లా బాపులపాడులో దారుణం జరిగింది. స్ధానికంగా ఉన్న పద్మ అనే బ్యూటిషయన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. అర్ధరాత్రి సమయంలో దాడి...

కృష్ణా జిల్లా బాపులపాడులో దారుణం జరిగింది. స్ధానికంగా ఉన్న పద్మ అనే బ్యూటిషయన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. అర్ధరాత్రి సమయంలో దాడి చేసిన దుండగులు కాళ్లు కట్టేసి చేతులు నరికారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొనఊపిరితో ఉన్న పద్మను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే గత కొద్ది కాలంగా భర్తకు దూరంగా ఉంటూ... బాధితురాలు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటమే ఈ ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories