ముంబైలో తప్పిన ఘోర ప్రమాదం

Submitted by arun on Tue, 07/03/2018 - 10:44
Mumbai Rains

ముంబైలో ఘోర ప్రమాదం తప్పింది. అంధేరీ రైల్వే స్టేషన్‌లో రోడ్ ఓవర్ బ్రిడ్జి‌లో కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. బ్రిడ్జి కూలడంతో పలు రైళ్ళ రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. బ్రిడ్జి కూలిన వెంటనే ముంబై పశ్చిమ లైన్‌పై సబర్బన్ రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు

ఈ ఉదయం అంధేరీ రైల్వే స్టేషన్‌ పక్కన గోఖలే రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి కొంత భాగం కుప్పకూలి ట్రాక్‌పై పడిపోయింది. ఆ సమయంలో రైళ్లేవీ ఆ మార్గంలో రాకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ముంబైలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్లే బ్రిడ్జ్ కూలినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అంధేరి ఈస్ట్‌, అంధేరి వెస్ట్‌ను కలిపే ఈ వంతెన కూలడంతో రైల్వే స్టేషన్‌లోని ఓవర్‌హెడ్‌ ఎక్విప్‌మెంట్‌ ధ్వంసమైందని పశ్చిమ రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనతో సెంట్రల్‌ రైల్వేకు చెందిన రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షంలోనూ...రైల్వే ట్రాక్‌పై కూలిన బ్రిడ్జ్ శిథిలాలను తొలిగించేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 

English Title
Mumbai Rains Andheri Bridge Collapses, 2 Critical

MORE FROM AUTHOR

RELATED ARTICLES