చిన్నారి ఊపిరితిత్తుల్లో ఎల్ ఈడీ బల్బ్

చిన్నారి ఊపిరితిత్తుల్లో ఎల్ ఈడీ బల్బ్
x
Highlights

మనం చిన్న పిల్లలకు ఆడుకోడానికిచ్చే ఆటబొమ్మలు ఒక్కోసారి వారి పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తాయి ఆటబొమ్మలతో జాగ్రత్తగా ఉండకపోతే అవి మనతో ఆటాడుకుంటాయ్...

మనం చిన్న పిల్లలకు ఆడుకోడానికిచ్చే ఆటబొమ్మలు ఒక్కోసారి వారి పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తాయి ఆటబొమ్మలతో జాగ్రత్తగా ఉండకపోతే అవి మనతో ఆటాడుకుంటాయ్ ముంబైలో ఏడునెలల చిన్నారి విషయంలో అదే జరిగింది ఇంతకీ ఆ చిన్నారి ఏం చేసింది?

పిల్లల చేతికి ఆటవస్తువులిస్తే ఎంత ప్రమాదం లేటెస్ట్ టాయ్స్ తో ఆటాడుకోడం కాదు మన తలరాత బాగో లేకపోతే పిల్లల జీవితాలతోనే అవి ఆటాడతాయ్ ఇది సత్యమని నిరూపించే సంఘటన ముంబైలో జరిగింది ఏడు నెలల పాప విపరీతంగా దగ్గుతో, తీవ్రమైనజ్వరంతో బాధపడుతోంది చిన్నారి విడువకుండా ఏడుస్తుండటంతో మొబైల్ పిన్ మింగిందేమోనని తల్లి దండ్రులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు వైద్యులు ఏవో మందులిచ్చారు కానీ ఉపయోగం లేదు.

ఎంత మంది డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లినా ఉపశమనం లేదు కారణమేంటో తెలీదు చిట్టి తల్లి పరిస్థితి రాను రాను దిగజారింది దగ్గి దగ్గి పాప అపస్మారక స్థితికి చేరుకోడంతో తల్లి దండ్రులు బాయ్ జర్బాయ్ వాడియా ఆస్పత్రికి తీసుకెళ్లారు చిన్నారికి ఏమైందా అని డాక్టర్లూ కంగారు పడ్డారు రకరకాల పరీక్షలు చేశారు బోలెడు మందులిచ్చారు కానీ నో యూజ్ చిన్నారి కేమైంది? చివరకు ఆమె దగ్గుకు కారణం కనుగొనడానికి ఆమె ఛాతీకి బ్రాంకోస్కోపీ తీశారు. అప్పుడు బయటపడింది ఓ చేదు నిజం చిన్నారి కుడి ఊపిరి తిత్తిలో ఓ ఎల్ ఈడి బల్బు కనిపించింది.

సుమారు రెండు సెంటీమీటర్ల వెడల్పు కలిగిన ఈ బల్బు ఆమె ఆడుకుంటున్న బొమ్మ సెల్ ఫోన్ నుంచి ఊడి ఆమె గొంతులోకి జారిపోయింది. బాలిక ఊపిరితిత్తిలో ఇరుక్కున్న ఎల్ ఈడీ బల్బును వెలికి తీసేదెలా? ఆరిబాఖాన్ అనే ఈ చిన్నారి శ్వాస నాళాలన్నీ తీవ్రమైన ఇన్ఫెక్షన్ తోనూ, కఫంతోనూ పెరుకుపోయాయి ఊపిరి తిత్తులు కూడా ఇన్ఫెక్షన్ తో నిండిపోడంతో లోపల ఉన్నదేంటో తెలియలేదు ఇన్ఫెక్షన్ కంట్రోల్ కావడానికి ముందు యాంటీ బయెటిక్స్ ఇచ్చారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యాక బ్రాంకోస్కోపీ చేయగా ఎల్ ఈ డి బల్బ్ కనిపించింది. ఇంట్రా వీనస్ యాంటీ బయటిక్స్, స్టెరాయిడ్స్ ఇచ్చి ఊపిరితిత్తుల్లో చేరిన ఫంగస్ ను పూర్తిగా అదుపు చేసి ఆ తర్వాత ఫోర్ సెప్ పెట్టి ఆ బల్బ్ ని బయటకు తీశారు. ఈ ఎల్ ఈ డి బల్బ్ డాక్టర్లకు అంత సులభంగా కనిపించలేదు కుడి ఊపిరి తిత్తిలో ఏదో వస్తువు ఉందన్న ఛాయలు మాత్రమే కనిపించడంతో దాదాపు వంద ఎక్స్ రేలు తీశారు చివరకు అది ఎల్ ఈ డి బల్బ్ గా గుర్తించి జాగ్రత్తగా బయటకు తీశారు. వాడియా ఆస్పత్రి ఛైల్డ్ బ్రాంకోస్కోపీలు చేయడంలో దేశంలోకే అగ్రగామిగా పేరుపడింది. చాలా ఆస్పత్రుల్లో నయంకాని బ్రాంకల్ సమస్యలు ఈ ఆస్పత్రిలో తగ్గుతాయన్న పేరుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories