దానం రాజీనామాపై ముఖేశ్‌గౌడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

x
Highlights

దానంతోటే సరిపెడతారా..? లేక మరో భారీ షాక్‌ను తగిలించుకుంటారా..? ఇప్పుడీ విషయమే.. కాంగ్రెస్ శిబిరంలో కల్లోలం పుట్టిస్తోంది. తన దారి తాను చూసుకుని...

దానంతోటే సరిపెడతారా..? లేక మరో భారీ షాక్‌ను తగిలించుకుంటారా..? ఇప్పుడీ విషయమే.. కాంగ్రెస్ శిబిరంలో కల్లోలం పుట్టిస్తోంది. తన దారి తాను చూసుకుని తొందరపడ్డారంటూ దానంపై మరో మాజీ మంత్రి ముకేశ్ గౌడ్.. చేసిన వ్యాఖ్యలు.. కలకలం పుట్టిస్తున్నాయి. కాస్త ఆగి ఉంటే.. అందరం కలిసి కారెక్కేవాళ్లమని.. ముఖేశ్ కుండబద్దలు కొట్టడం.. గ్రేటర్ కాంగ్రెస్‌లో అసంతృప్తి స్థాయి ఏ రేంజులో ఉందో.. చెబుతోంది.

కాంగ్రెస్‌ను కాదని.. కారెక్కేందుకు సిద్ధమైన దానం నాగేందర్‌పై మరో మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హెచ్‌ఎం టీవీతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. దానం తొందరపడ్డారని.. అన్నారు. ఇప్పుడప్పుడే రాజీనామా చేసేది కాదని చెప్పుకొచ్చారు. త్వరలోనే హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను పిలిచి.. ఆయన సమక్షంలోనే అందరం కలిసి.. టీఆర్ఎస్‌లో చేరేలా ప్రణాళికలు రూపొందించామని.. తన కుమారుడు విక్రమ్ గౌడ్‌తో కలిసి ముఖేశ్‌ చెప్పారు. అయితే అంతలోనే దానం తొందరపడి రాజీనామా చేశారని.. అయితే తాను మాత్రం గ్రౌండ్ వర్క్ చేస్తున్నానని.. వివరించారు.

గతంలో వరంగల్‌లో భారీ స్థాయిలో.. బీసీలతో సభ పెట్టి సోనియాగాంధీని ఆహ్వానించామని.. ఇప్పుడదే రేంజ్‌లో హైదరాబాద్‌లో సభ పెట్టి.. తాను, తన కుమారుడు, అనుచరవర్గమంతా టీఆర్ఎస్‌లో చేరతామని తెలిపారు. సీనియర్లకు గౌరవం ఇవ్వకపోవడమే తాము కాంగ్రెస్‌ను వీడటానికి ముఖ్యకారణమని కుండ బద్దలు కొట్టారు. గాంధీభవన్ కు కూతవేటు దూరంలో ఉన్నా.. అందులో జరిగే సమావేశాలకు తమను ఆహ్వానించడం లేదని.. తన అసంతృప్తిని వెళ్లగక్కారు.

ముఖ్యంగా.. టీఆర్‌ఎస్‌లో చేరికపై ఏడాదిన్నర కాలంగా సందిగ్ధంలో ఉన్న ముఖేష్ గౌడ్.. ఇదే విషయంపై తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. గోషామహల్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ముఖేశ్ గౌడ్.. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్తి రాజాసింగ్ చేతిలో ఓడిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories