తాగి వాహనం నడిపితే రూ.10000 ఫైన్..

Submitted by nanireddy on Thu, 07/26/2018 - 10:04
motor-vehicle-bill-rajya-sabha-amendment

ప్రమాదాల నివారణకు కీలకంగా భావిస్తోన్న మోటారువాహనాల సవరణ బిల్లు 2017, లోక్‌సభలో ఆమోదం పొందగా.. రాజ్యసభలో మాత్రం ప్రతిపక్షాలు ఈ బిల్లును అడ్డుకున్నాయి. వివిధ రాష్ట్రాల పరిధిలో ఉండే ఈ విధానం రాష్ట్రప్రభుత్వాల అధికారాలను నియంత్రిస్తోందనీ, కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా మారిందన్న నేపథ్యంలో కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్ సహా పలు పక్షాలు  ఈ బిల్లుని అడ్డుకున్నాయి. అయితే విచ్చలవిడిగా జరుగుతోన్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించే కీలకమైన అంశాలు ఈ బిల్లులో పొందుపరిచారు.

ప్రమాదాలతో ప్రంపంచంలోనే ప్రథమస్థానంలో ఉన్న భారత్ లో యేడాదికి 1.46 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని అరికట్టేందుకు కఠినమైన చర్యలు తప్పక తీసుకోవాలని తద్వారా భారతదేశం 2020 కల్లా రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. కానీ ఈ బిల్లులో కొన్ని మార్పులు చేసి పార్లమెంటులో ప్రవేశపెట్టినా అది ఆమోదం కాకపోవడం గమనార్హం.. ఆమోదం  పొందకపోవడానికి ఇంతకీ ఆ బిల్లులో ఏముంది.?  రాష్ట్ర ప్రభత్వాలకు ఏ ప్రమాదం పొంచివుందో కొన్ని అంశాలు.. 

1. వాహన రిజిస్ట్రేషన్‌కీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌కీ ఆధార్‌ తప్పనిసరి.
2. వాహనాలు ఢీ కొట్టి పారిపోయిన ఘటనల్లో  బాధితులకు నష్టపరిహారంగా ప్రభుత్వమే చెల్లిస్తోంది. కాగా  ప్రస్తుతం చెల్లిస్తోన్న 25,000 రూపాయలను 2 లక్షలకు పెంచారు.
3. ప్రమాదాలకు మైనర్లు కారణమైన సందర్భంలో వాహనయజమాని కానీ, సదరు మైనరు సంరక్షకులుగానీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. 
4. మద్యం, ఇతర మత్తుపానీయాలు సేవించి వాహనాలు నడిపిన వారికి ఇప్పుడు విధించే ఫైన్‌ని 2000 నుంచి 10,000 రూపాయలకు పెంచారు.
6. ఇష్టమొచ్చినట్టు రాష్‌గా వాహనాలు నడిపితే విధించే జరిమానాను 1000 రూపాయల నుంచి 5000 రూపాయలకు పెంచారు. అంతేకాకుండా జైలుశిక్ష తప్పనిసరి. 
7. లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపితే 500 రూపాయల జరిమానాను 5000 రూపాయలకు పెంచారు. 
8. అతివేగంగా వాహనాలు నడిపినందుకు ప్రస్తుతం విధిస్తున్న 400 రూపాయల ఫైన్‌ని 2000 వరకు పెంచారు. 

English Title
motor-vehicle-bill-rajya-sabha-amendment

MORE FROM AUTHOR

RELATED ARTICLES