టీడీపీనుంచి మోత్కుపల్లి అవుట్.. ఆ పార్టీలో చేరతారా?

Submitted by nanireddy on Tue, 05/29/2018 - 08:17
motkupalli-narasimhulu-expelled-tdp

మాజీ మంత్రి, తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ఆ పార్టీ  పొల్యూట్ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నరసింహులుపై అధికారికంగా టీడీపీ వేటు వేసింది. గతకొన్ని రోజులుగా పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు మోత్కుపల్లి. దీంతో అయనపై చర్యలకు ఉపక్రమించారు అధినేత. ఈ మేరకు మోత్కుపల్లి నర్సింహులను పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ సోమవారం మహానాడులో ప్రకటించారు.  నిన్న(సోమవారం) అయన చంద్రబాబునాయుడు అయన కుమారుడు మంత్రి లోకేష్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు . తన మామ ఎన్టీఆర్ నుంచి బలవంతంగా పార్టీని లాక్కుని తన పక్కన  పనికిరానివారిని చేర్చుకున్నారని అన్నారు. పార్టీకోసం జీవితాన్ని ధారపోసిన తనలాంటి కార్యకర్తలను చంద్రబాబునాయడు విస్మరించాడని.. తెలంగాణాలో మహానాడు జరిగితే సీనియర్ నేతనైనా తనకు కనీసం ఆహ్వానం కూడా లేదని వాపోయారు. ఇదిలావుంటే టీడీపీనుంచి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి టీఆరెస్ లో చేరే అవకాశం కనిపిస్తోంది. 

English Title
motkupalli-narasimhulu-expelled-tdp

MORE FROM AUTHOR

RELATED ARTICLES