అమ్మ కాదంది...అత్తమ్మ ఆదుకుంది

Submitted by arun on Sat, 10/06/2018 - 15:02
Kidney donation

సాధారణంగా అత్తల వేధింపులు భరించలేక ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. వరకట్న వేధింపుల పేరుతో తమ కోడళ్ళకు నరకం చూపిస్తున్న ఈ రోజుల్లో ఆ అత్త మాత్రం తన కోడలికి ప్రాణదానం చేసింది. నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లే కుమార్తె ప్రాణాలు కాపాడేందుకు ముందుకురాలేదు. కానీ ఆ అత్త మాత్రం ముందుకు వచ్చి కోడలి ప్రాణాలు కాపాడింది. ఇపుడు ఆ అత్తపై సోషల్ మీడియాలో నెటిజన్లతో పాటు.. స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రాజస్థాన్‌లోని బాడ్మేర్ సమీపంలోని గాంధీన‌గర్‌కు చెందిన గోనీదేవి, సోనికాలు అత్తాకోడళ్లు. వారిద్దరూ తొలుతనుంచి అత్తాకోడళ్ళలా కాకుండా తల్లీబిడ్డల్లా వున్నారు. ఈ క్రమంలో గతేడాది కోడలు సోనికాకు కిడ్నీ సంబంధిత వ్యాధి సోకింది. అప్పటినుంచి చాలా ఆసుపత్రుల్లో ఆమెకు వైద్యం చేయించారు. అయినా ఆమె ఆరోగ్యం క్షీణిస్తూనే వస్తోంది. డాక్టర్లు, ఆమెకు వెంటనే కిడ్నీని ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని సూచించారు. లేదంటే ప్రాణాపాయం వుందని హెచ్చరించారు. దీంతో కోడలు ప్రాణాన్ని కాపాడేందుకు అత్తగారు  గోనీదేవి ముందుకు వచ్చారు. ముఖ్యంగా సోనికా తల్లి భాన్వరి దేవితో పాటు, సోదరుడు, తండ్రి కూడా కిడ్నీదానం చేయడానికి  నిరాకరించారు. దీంతో సోనికాను కూతురిగా భావించిన అత్తగారు గోనీదేవి తన కిడ్నీని దానం చేయడానికి అంగీకరించారు. సెప్టెంబర్ 13న ఆపరేషన్‌ అనంతరం ప్రస్తుతం సోనికా పూర్తిగా కోలుకుంది. తనకు పునర్జన్మ ప్రసాదించిన అత్తమ్మకు  కన్నీటితో కృతజృతలు తెలిపింది. అటు తన తల్లి పూర్తి ఆరోగ్యంతో​ కోలుకోవడంతో సోనికా ఇద్దరు కుమార్తెలు కూడా సంతోషంగా ఉన్నారు.
 

English Title
Mother refuses, mom-in-law donates kidney to woman

MORE FROM AUTHOR

RELATED ARTICLES