సొంత అల్లుడితో అత్త అఫైర్...కన్న కొడుకు అడ్డొస్తున్నాడని...

Submitted by arun on Mon, 08/13/2018 - 12:04
illegal affairs

మానవతా విలువలు మాయమైపోతున్నాయనడానికి ఈ ఉదంతం ఒక గట్టి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అల్లుడు(కూతురు భర్త)తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తమ రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే కిరాయి హంతకులచేత హత్య చేయించింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకొంది. కిరాయి హంతకులకు ఇచ్చే డబ్బుల విషయంలో  తేడాలు రావడంతో  ఈ విషయం వెలుగు చూసింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 

నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట మండలం గమళ్లపాలెంకు చెందిన బొడుగు కార్తీక్‌ను గత జూలై 17వ తేదీన గుర్తు తెలియని దుండగులు  హత్య చేశారు. అయితే ఈ హత్య కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. గత నెల 17 వతేదీన కార్తీక్ ను  కిరాయి హంతకులు  కిడ్నాప్ చేశారు. టీపీగూడూరు మండలం కోడూరుకు తీసుకెళ్లి హత్య చేశారు. మరునాడు మృతదేహన్ని కనుపర్తిపాడు వద్ద జాతీయరహదారి పక్కనే ఉన్న కాలువలో వేశారు. కార్తీక్ తల్లికి అతడి బావకు వివాహేతర సంబంధం ఉంది.  ఈ విషయం కార్గీక్ కు తెలిసింది.  స్వంత కూతురు భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న విషయమై తల్లిని కార్తీక్ నిలదీశాడు.  ఈ విషయమై ప్రతిరోజూ తల్లితో గొడవపడేవాడు.  మద్యం తాగొచ్చి తల్లిని కొట్టేవాడు.  

దీంతో  తమ బంధం బట్టబయలయ్యే అవకాశం ఉందని కార్తీక్ తల్లి భావించింది.ఈ మేరకు కొడుకును హత్య చేయాలని భావించింది.ఈ విషయాన్ని అల్లుడికి చెప్పింది. దీంతో అత్త, అల్లుడు కలిసి కార్తీక్‌ను హత్య చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. రూ.5 లక్షలకు కిరాయి హంతకులతో ఒప్పందాన్ని కుదుర్చుకొన్నారు. అయితే కిరాయి హంతకులకు డబ్బులు చెల్లించే విషయమూ విబేధాలు రావడంతో కార్తీక్ హత్య విషయం వెలుగుచూసింది. దీంతో  ఈ కేసు విషయంలో  నిందితులైన కిరాయి హంతకులతో పాటు సూత్రధారులైన తల్లి, భావను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.  

English Title
mother-kills-son

MORE FROM AUTHOR

RELATED ARTICLES