హైదరాబాద్‌లో దారుణం...చిన్నారి ప్రాణాలు బలిగొన్న వివాహేతర సంబంధం

Submitted by arun on Mon, 10/08/2018 - 11:41
Madannapet

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు బలిగొంది. పాతబస్తీ పరిధిలోని  మాదన్నపేటకు చెందిన మూక్రమ్ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక పిల్లాడు ఉన్నారు. వీరి కాపురంలో  కొద్ది కాలం క్రితం  విబేధాలు వచ్చారు. తన సోదరితో భర్త వివాహేతర సంబంధం నడుపుతున్నాడని తెలుసుకుని భార్య పలుసార్లు గొడవకు దిగింది.  భర్త ఎన్నిసార్లు తీరు మార్చుకోకపోవడంతో మూడేళ్ల బాలుడిని చంపి సంపులో పడేసింది. అయితే లేనిపోని అపోహలతో తన భార్య ఈ హత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ భర్త మూక్రమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

Tags
English Title
Mother killed her son alleged by Husband

MORE FROM AUTHOR

RELATED ARTICLES