బిడ్డను బతికించుకునేందుకు ఎవరూ చేయని సాహసం చేసిన తల్లి

Submitted by arun on Mon, 02/05/2018 - 18:51
China, Mother

బిడ్డను బతికించుకునేందుకు ఎవరూ చేయని సాహసం చేసింది ఓ తల్లి. ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న తన చిన్నారిని బతికించుకోవడానికి ఓ తల్లి తన చనుబాలను విక్రయానికి పెట్టింది. ఈ ఘటన చైనాలో వెలుగుచూసింది. వైద్యానికి సరిపడా డబ్బు లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిల్లో ఆ తల్లి ఇలా తన చనుబాలను విక్రయిస్తూ ఆర్థిక సాయాన్ని అర్థిస్తోంది.
 
చైనాలోని షేన్‌జాన్ నగరానికి చెందిన ఓ జంటకు కవల పిల్లలు ఉన్నారు. అయితే వారిలో ఒకరికి జబ్బు చేసింది. దీంతో ఆ చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించగా.. రూ. 10 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. అంతమొత్తం చెల్లించే స్థోమత లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఓవైపు తమ బిడ్డను బతికించుకోవాలనే తపన.. మరోవైపు ఎలా అంత డబ్బు సంపాదించాలో తెలియని విపత్కర పరిస్థితుల్లో ఆ తల్లి పెద్ద సాహసమే చేసింది. తన చిన్నారి ప్రాణాలకంటే తనకేదీ ఎక్కువ కాదని భావించిన ఆ మాతృమూర్తి.. రద్దీగా ఉండే ప్రదేశంలో ‘‘తమ కుటుంబం ఇబ్బందుల్లో ఉందని, తమ చిన్నారికి వైద్యం కోసం రూ. 10 లక్షలు అవసరమయ్యాయంటూ.. నిముషానికి రూ. 100 తీసుకొని మీ పిల్లలకు పాలిస్తానని’’ ప్లకార్డు ఏర్పాటుచేసి ఆర్థిక సాయాన్ని అర్థిస్తోంది. కాగా, దీనిని వీడియో తీసిన కొందరు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ విడియో కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది.


 

English Title
mother in China is selling her breast milk

MORE FROM AUTHOR

RELATED ARTICLES