ముగ్గురు పిల్లలతో సహా కాలువలోకి దూకిన తల్లి.. పిల్లలు మృతి..

Submitted by nanireddy on Fri, 10/05/2018 - 18:29
mother-attempt-suicide-in-nalgonda

నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మృతి చెందారు.  అనుముల మండలం హాలియా సమీపంలోని సాగర్‌ ఎడమ కాలువలో ఈ ఘటన జరిగింది.. కాలువలో దూకిన తల్లి స్వాతిని స్థానికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండటంతో విసిగిపోయిన స్వాతి… భర్త మోహన్‌తో గొడవ పడి తన ముగ్గురు పిల్లలతో కలిసి నీటి కాలువలోకి దూకింది. అయితే పక్కననుంచే వెళ్తున్న స్థానికులు వారిని గమనించి రక్షించబోయేలోపే ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. కాగా..స్వాతి భర్త పెద్దపూర పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇక ఈ ఘటనపై సమాచారమందుముకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

English Title
mother-attempt-suicide-in-nalgonda

MORE FROM AUTHOR

RELATED ARTICLES