పోదాం పదండి చైనాలోని కోతుల బడికి...!

Highlights

జపాన్‌లో రెస్టారెంట్‌లో పనిచేసే కోతులు.... చైనాలో కాసేపు అల్లరిని పక్కనబెట్టాయి...బుద్ధిగా స్కూలుకొచ్చి చదువుకుంటున్నాయి... టీచర్లు చెప్పిన పాఠాలన్నీ...

జపాన్‌లో రెస్టారెంట్‌లో పనిచేసే కోతులు.... చైనాలో కాసేపు అల్లరిని పక్కనబెట్టాయి...బుద్ధిగా స్కూలుకొచ్చి చదువుకుంటున్నాయి... టీచర్లు చెప్పిన పాఠాలన్నీ నేర్చుకుంటున్నాయి... కోతులేంటి? స్కూలేంటి? అనుకుంటున్నారా? నమ్మట్లేదా?
కోతులు బుద్ధిగా స్కూల్‌ యూనిఫాం వేసుకున్నాయి. పాఠశాలకూ వెళ్తాయ్‌. గంట కొట్టగానే తరగతి గదిలోకీ వెళ్లాయి. ఎవరి కుర్చీలపై ఆ కోతులు కూర్చున్నాయి. టీచర్‌ రాగానే గౌరవంగా లేచి నిల్చుని సెల్యూట్‌ చేశాయి. టీచర్‌ చెప్పే పాఠాలన్నీ నేర్చుకుని, వెంటనే అప్పజెప్పేస్తున్నాయి. అవును చైనాలో ఈ మధ్యే ఈ కోతుల పాఠశాల ప్రారంభించారు. ఈ స్కూలు అచ్చం మన స్కూళ్లలాగే అన్ని వసతులతో ఉంటుంది. టీచర్లు కూడా ఉంటారు. కానీ అందులో చదువుకునేది మాత్రం మొత్తం కోతులే! డాంగ్యింగ్‌లోని ఎల్లో రివర్‌ డెల్టా జూ వాళ్లే ఈ పాఠశాల ప్రారంభించారు. కోతులకు బడేంటని కొట్టిపారేయకండి. ఇందులో వాటికి బోలెడు విద్యలు నేర్పి, చైనాలోని సర్కస్‌లకు, ఇంకా ఎన్నో రకాల వినోద కార్యక్రమాల ప్రదర్శనలకు పంపిస్తారు. ఇది చైనాలోనే తొలి కోతుల బడిగా గుర్తింపు పొందింది.
ఈ మంకీ స్కూల్లో సుమారు 30 జపాన్‌ మకాక్‌ కోతులు శిక్షణ పొందుతున్నాయి. ఇంతకీ ఏమేం నేర్పిస్తారనే కదా మీ సందేహం. కోతులకు చిన్న చిన్న లెక్కలు చేయడం, తాడుపై నడవడం, బృందంగా కలిసి రకరకాల విన్యాసాలు చేయడం, స్కూటరు తోలడం ఇలా ఒక్కటనేంటి ఎన్నో విద్యలను నేర్పిస్తారు. వీటి కోసం ఎంతో మంది గురువులు పనిచేస్తున్నారు.
ఈ కోతులతో రోజూ రకరకాల వ్యాయామాలు కూడా చేయిస్తారు. కేవలం వినోద కార్యక్రమాలే కాదు, ఈ కోతులకు విమానాశ్రయాల్లో చెట్లపై ఉన్న పిట్ట గూళ్లను కూడా తొలగించేలా శిక్షణ ఇస్తారట. ఇక్కడ తరగతి గదుల్లో నల్ల బల్లతో సహా, కూర్చోవడానికి కుర్చీలు, తొడుక్కోవడానికి దుస్తులూ ఉంటాయి. శిక్షణ కోసం జపాన్‌ మకాక్‌ కోతులనే ఎంచుకోవడానికి కారణమేంటో తెలుసా? సహజంగా ఈ జాతి మర్కటాలకు తెలివి తేటలు చాలా ఎక్కువ. జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో నాణేలు వేస్తే తినుబండారాలు వచ్చే యంత్రాలుంటాయి. ఇది గ్రహించిన ఈ కోతులు మనుషుల దగ్గర కాయిన్స్‌ దొంగిలించి వాటిని యంత్రాల్లో వేసి తినుబండారాలు తీసుకుంటాయిట.

Show Full Article
Print Article
Next Story
More Stories