డీఎస్‌ కుమారుడిపై 11 విద్యార్థినుల ఫిర్యాదు.. లైంగికంగా వేధిస్తున్నాడు..

Submitted by nanireddy on Fri, 08/03/2018 - 07:46
molestation-accusations-trs-leader-d-srinivas-son

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కుమారుడు సంజయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. డీఎస్‌ తనయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నిజామాబాద్ శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినిలు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మధ్య కాలంలో తమలో ఇద్దరిని సంజయ్ బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడులు చేయడానికి ప్రయత్నించారని హోంమంత్రికి విద్యార్థినిలు వివరించారు. వారు ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తుంటే.. అదే సమయంలో ఓ మేడమ్ రావడం వల్ల వదిలి పెట్టారన్నారు.  ఆరు నెలలుగా తమను సంజయ్‌ లైంగికంగా వేధిస్తున్నాడని మొత్తం 11 మంది విద్యార్థిని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంజయ్ కి చెందిన శాంకరి కాలేజీలో చదువుతున్న విద్యార్థినులపై సంజయ్‌ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్‌ను అరెస్ట్‌ చేయాలనీ, శాంకరి నర్సింగ్‌ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి.

English Title
molestation-accusations-trs-leader-d-srinivas-son

MORE FROM AUTHOR

RELATED ARTICLES