అమిత్‌ షా.. మళ్లీ పప్పులో కాలు!

Submitted by arun on Fri, 03/30/2018 - 13:29
Amith shah

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కమల దళానికి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయ్. సర్వేల్లో ఇప్పటికే బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. మరోవైపు అమిత్‌ షా వ్యాఖ్యలే ఆ పార్టీకి చేటు తెస్తున్నాయ్. ప్రెస్‌మీట్లు, ప్రచారాల్లో అమిత్ షా తడబాటుతో ఓటర్లే విస్తుపోతున్నారు. అమిత్ షా కామెంట్స్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన అస్త్రాలుగా మారాయ్. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతల ప్రచారాన్ని కాంగ్రెస్‌ పార్టీ అనుకూలంగా మార్చుకుంటోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యాఖ్యలు ఆ పార్టీకి కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయ్. కర్ణాటకలోని దావణగిరి జిల్లాలో అమిత్‌ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమిత్ షా ప్రసంగాన్ని ప్రహ్లాద్‌ జోషి ప్రధాని మోడి దేశాన్ని సర్వనాశనం చేస్తారు దళితుల, పేదలకు ఆయనకు చేసిందేమీ లేదు దేశాన్ని నాశనం చేయడం ఖాయమంటూ అనువాదం చేశారు. అమిత్ షా హిందీలో చేసిన ప్రసంగాన్ని కర్ణాటక బీజేపీ నేత ప్రహ్లాద్‌ జోషి తప్పుగా అనువదించడంతో ర్యాలీకి వచ్చిన ప్రజలు, నేతలు విస్తుపోయారు. 

రెండు రోజుల క్రితం జరిగిన ప్రెస్‌మీట్‌లోనూ అమిత్‌ షా యడ్యూరప్పపై నోరు జారారు. అత్యంత అవినీతికి పాల్పడ్డ ప్రభుత్వాలు పోటీ పెడితే యడ్యూరప్ప సర్కారే నెంబర్‌ వన్‌ అవార్డు సాధిస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలతో తేరుకున్న ప్రహ్లాద్‌ జోషి మిత్‌ షాకు వెంటనే సిద్ధరామయ్య సర్కార్‌ చెప్పడంతో వ్యాఖ్యలను మార్చేశారు. 

అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ అనుకూలంగా మార్చుకుంటోంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు ఆ పార్టీనేతలు వరుస ట్వీట్లతో అమిత్‌ షాను, బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అమిత్‌ షా వ్యాఖ‌్యలను సోషల్ మీడియాలో ఎప్పటికపుడు అప్‌డేట్ చేస్తున్నారు. అమిత్ షా అబద్దాల పుట్ట అన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చివరికి నిజాలు మాట్లాడారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

English Title
Modi won't do anything for poor, will destroy nation: Amit Shah's translator goofs up at Karnataka rally

MORE FROM AUTHOR

RELATED ARTICLES