చావోరేవో తేల్చుకునేందుకు రంగంలోకి దిగా : మోదీ

చావోరేవో తేల్చుకునేందుకు రంగంలోకి దిగా : మోదీ
x
Highlights

గుజరాత్‌లో చావోరేవో తేల్చుకునేందుకు రంగంలోకి దిగాడు మోదీ. 40 బహిరంగ సభలు, రకరకాల భావోద్వేగ అస్త్రాలు, 28 వేల కిలోమీటర్లు ప్రచారం, ఇలా తన...

గుజరాత్‌లో చావోరేవో తేల్చుకునేందుకు రంగంలోకి దిగాడు మోదీ. 40 బహిరంగ సభలు, రకరకాల భావోద్వేగ అస్త్రాలు, 28 వేల కిలోమీటర్లు ప్రచారం, ఇలా తన సొంతరాష్ట్రంలో విజయకేతనం ఎగురవేశాడు మోదీ. అక్కడ సీఎం విజయ్‌ రూపానీని, పూర్తిగా పక్కనపెట్టేసి, బాధ్యతలన్నీ తన భుజాలపై వేసుకుని విజయాన్ని ముద్దాడాడు
మోడీ.పటేళ్ల ఉద్యమం, జీఎస్టీలు గుజరాత్ లో బీజేపీ మట్టి కరిపించడం కాయమనుకున్నారు. అందుకే ఏడు అస్త్రాల్ని సిద్ధం చేసుకొని ప్రత్యర్ధి పార్టీలు ఇరుకున పెట్టేవిధంగా ప్రయోగించాడు. దీంతో మోదీ కాళ్ల ముందు విజయం దాసోహమైంది.
1. రాహుల్‌పై మతాస్త్రం
2. అయ్యర్ నీచ్‌ వ్యాఖ్యలతో సెంటిమంట
3. పాకిస్తాన్‌ బ్రహ్మాస్త్రం
4. ముస్లిం రాజులతో యువరాజు పోలిక
5. రామ మందిరం రగడ
6. హార్థిక్‌ పటేల్‌ సెక్స్‌ సీడీల బాగోతం
7. జీఎస్టీ రేట్ల తగ్గింపు
ఈ ఏడు అస్త్రాల్లో జీఎస్టీ అంశం మోదీకి బాగా కలిసొచ్చిన అంశమనే చెప్పాలి. ఎన్నికల ముందు జీఎస్టీ రేట్లు పెంచిన బీజేపీ..గుజరాత్ ప్రజల వ్యతిరేకకతో జీఎస్టీ రేట్లు తగ్గించింది. దీంతో కాంగ్రెస్ ఓడిపోయిందనే వాదన వినిపిస్తుంది. ఇక గుజరాత్, సూరత్ లలో 14శాతం ఓటు బ్యాంకు కలిగిన పటేళ్లను తనవైపుకు తిప్పుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. ఇందులోభాగంగా పటేళ్ల ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ ఎన్నికలు ఏడాది ముందునుంచే కమలాన్ని కార్నర్ చేసి పటేల్ కులస్తులకు రిజర్వేషన్లు కోరుతూ పెద్ద ఎత్తున ఉద్యమాలే చేశాడు. గుజరాత్ బిజెపికి ఒక దశలో చుక్కలు చూపించాడు. పాటీదార్లకు రాజ్యంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పార్టీలపై ఒత్తిడి పెంచాడు. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జీఎస్టీనే అస్త్రంగా కమలంపై విమర్శనాస్త్రాలు సంధించారు. జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ తో పోలుస్తూ ఓటు బ్యాంకు చీల్చే ప్రయత్నం చేశారు. దీంతో గుజరాత్ లో బీజేపీ ఓడిపోవడం ఖాయమనుకున్న కాంగ్రెస్ కు మోదీ తన పవరేంటో రుచి చూపించారు. గుజరాత్ లో టెక్స్ టైల్ హబ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అందులో 14శాతం పటేళ్ల వర్గానికి చెందిన టెక్స్ టైల్ రంగంలో ఉన్నవారే ఎక్కువ. దీంతో జీఎస్టీ ఎఫెక్ట్, పటేళ్ల రిజర్వేషన్ల అంశం గుజరాత్ ఎన్నికలపై ప్రభావితం చూపుందని ఊహించారు. కానీ గుజరాత్‌ రణక్షేత్రంలో నరేంద్ర మోడీ ఆయుధాల్ని ప్రయోగించడంతో ఆ పాచికలు ఏం పారలేదు. ఓవైపు ప్రజల్ని రెచ్చగొట్టి జీఎస్టీకార్నర్ చేసి గుజరాత్‌లో బీజేపీపై ఓ రేంజ్‌లో ఆగ్రహం ఉంది. వ్యాపారుల్లో అత్యధికంగా మోదీ మీద గొంతుమీదికి ఉన్నారు. అందుకే ఆఖరి నిమిషంలో జీఎస్టీ రేట్లు తగ్గించి, వారి కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు మోదీ. అంతేకాదు పటేళ్లకు రిజ్వర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదంటూ..ఆ వర్గానికి చెందిన వారు నొచ్చుకోకుండా మోడీ చేసిన ప్రయత్నం సెక్సెస్ అయ్యింది. దీంతో సూరత్, గుజరాత్ లలో బీజేపీ గెలుపుకు దోహదం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories