కేసీఆర్ పూజలపై మోదీ షాకింగ్ కామెంట్స్...

కేసీఆర్ పూజలపై మోదీ షాకింగ్ కామెంట్స్...
x
Highlights

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తెలుగులో ప్రసంగానికి శ్రీకారం చుట్టారు. అమరవీరుల కల సాకారం చేసిన తెలంగాణకు వందనమంటూ నిజామాబాద్‌లో జరిగిన...

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తెలుగులో ప్రసంగానికి శ్రీకారం చుట్టారు. అమరవీరుల కల సాకారం చేసిన తెలంగాణకు వందనమంటూ నిజామాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తెలుగులో ప్రసంగించారు. రజాకార్లను ధైర్యంగా ఎదురించిన నేల తెలంగాణ అన్న మోడీ మూడు నదులు ప్రవహించే పుణ్య భూమి తెలంగాణ అని కొనియాడారు. నిజామాబాద్‌ సభలో ప్రధాని మోడీ టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ పాలన కాంగ్రెస్ తరహాలోనే అభివృద్ధి రహితంగా సాగుతోందని మోడీ అన్నారు. ఎలాంటి అభివృద్ధి చేయకుండా 50 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్లుగానే తామూ తెలంగాణలో అధికారం చెలాయించాలని కేసీఆర్ కుటుంబం భావిస్తోందని అయితే అభివృద్ధిని పట్టించుకోని వారు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేరని మోడీ అన్నారు. మరోసారి ఎన్నికల్లో గెలవాలన్న కేసీఆర్ ఆశలు నెరవేరవని మోడీ జోస్యం చెప్పారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ పూర్తి అభద్రతా భావంతో ఉన్నారని మోడీ అన్నారు. కేసీఆర్ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా మంత్ర తంత్రాలను, జ్యోతిష్యులను నమ్ముకుని జీవిస్తున్నారని మోడీ ఎద్దేవా చేశారు. అందుకే కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయడానికి నిరాకరించారని మోడీ ఆరోపించారు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి ఏడాదికి ఐదు లక్షల రూపాయల చికిత్స అందించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తే మోడీ ప్రభుత్వానికి పేరు వస్తుందని భావనతో ఆ పధకాన్ని పక్కన పెట్టేశారని విమర్శించారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల పేదలకు తీవ్ర నష్టం జరగిందని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories