రైతన్నకు గుడ్ న్యూస్.. కనీస మద్దతు ధరను పెంచిన కేంద్రం!

రైతన్నకు గుడ్ న్యూస్.. కనీస మద్దతు ధరను పెంచిన కేంద్రం!
x
Highlights

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2018-19 ఏడాదికి గానూ వరికి క్వింటాలుకు రూ.200 మేర మద్దతు ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం...

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2018-19 ఏడాదికి గానూ వరికి క్వింటాలుకు రూ.200 మేర మద్దతు ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా దేశంలో వరి ఉత్పత్తి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. గత ఏడాది వరి పంట ఉత్పత్తి 11.1 కోట్ల టన్నులతో కొత్త రికార్డును అందుకుంది. ఈ ఏడాది రూ.200 మద్దతు ధర పెంచడంతో క్వింటాలుకు మద్దతు ధర రూ.1750కు చేరింది. వరితోపాటు మరో 13 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచడానికి సైతం కేంద్ర సర్కారు ఒప్పుకుంది. వచ్చే కేంద్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు ఆమోద ముద్ర వేయనున్నారు. సాధారణంగా పంట వేసే ముందు కేంద్ర సర్కారు కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. ఆ ప్రకటన మేరకు రైతులు ఏ పంట వేయాలన్న నిర్ణయం తీసుకుంటారు

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనే 14 ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధరను ఉత్పత్తి ఖర్చు కంటే 1.5 రెట్లు ఎక్కువగా పెంచనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్‌లో ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మంగళవారమే ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌ సింగ్‌, నీతి ఆయోగ్‌ ప్లానింగ్‌ బాడీ అధికారులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతీసుకున్న నిర్ణయాన్ని చరిత్రాత్మక నిర్ణయమని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు.

వరితో పాటు పత్తి కనీస మద్దతు ధర కూడా రూ.4,020 నుంచి రూ.5,150కు పెరిగింది. అదేవిధంగా పత్తి(లాంగ్‌ స్టాపుల్‌) కనీస మద్దతు ధర కూడా క్వింటాకు రూ.4,320 నుంచి రూ.5,450కు పెంచారు. పప్పు ధాన్యాల కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,450 నుంచి రూ.5,675కు పెంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories