ర్యాంప్ వాక్ చేస్తూ బిడ్డకు పాలిచ్చిన మోడల్..

Submitted by arun on Wed, 07/18/2018 - 14:19
Model breastfeeds baby on catwalk

ఈ మోడల్ ప్రపంచానికి ఓ వినూత్న సందేశాన్నిచ్చింది. ర్యాంప్ వాక్ చేస్తున్న సమయంలోనే తన ఐదు నెలల బిడ్డకు పాలిచ్చింది మోడల్ మారా మార్టిన్. అమెరికాకు చెందిన మారా మార్టిన్‌ అనే మోడల్‌ స్లిమ్‌ షూట్‌ ప్రచార కార్యక్రమంలో భాగంగా మియామిలో నిర్వహించిన ఒక ర్యాంప్‌ షోలో పాల్గొంది. మోడల్‌ కంటే ముందు మార్టినా ఓ బిడ్డకు తల్లి. ఆ విషయం ఆమెకు బాగా తెలుసు. ర్యాంప్‌ వాక్‌ చేస్తుండగా మార్టినా ఐదు నెలల చిన్నారి ఏడుపు ప్రారంభించింది. తల్లి కదా అందుకే బిడ్డ ఎందుకు ఏడుస్తోందో మార్టినాకు వెంటనే అర్ధమైంది. ర్యాంప్‌వాక్‌ నుంచి బయటకు వచ్చి తన చిన్నారి ఆకలి తీర్చాలనుకుంది. కానీ షో నిర్వాహకులు బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్‌ వాక్‌ చేయమని సలహా ఇచ్చారు. దాంతో మార్టినా బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్‌ వాక్‌ చేశారు.

ఇందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు మార్టినా. మార్టినా షేర్‌ చేసిన ఈ ఫోటోకు అనూహ్యంగా.. పెద్ద ఎత్తున జనాలు మార్టినాకు అభినందనలు తెలుపుతున్నారు. బిడ్డతో కలిసి ర్యాంప్ వాక్ చేసినందుకు ఈ స్థాయిలో స్పందన వస్తుందని తాను ఊహించలేదని మారా చెప్పింది. తాను అలా నడవాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నానని.. తద్వారా తల్లిపాల ప్రాముఖ్యతను వివరించాలన్నది తన ఉద్దేశమని మారా తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన పనిని కొందరు విమర్శిస్తున్నా.. చాలా మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 

English Title
Model breastfeeds baby on catwalk

MORE FROM AUTHOR

RELATED ARTICLES