అమిత్ షా తెచ్చిన తంటా.. కనిపించకుండా పోయిన సోము వీర్రాజు!

Submitted by nanireddy on Mon, 05/14/2018 - 10:18
mlc somu verraju unhappy on ap bjp president selection

నిన్న(ఆదివారం) ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. దాంతో ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న  ఎమ్మెల్సీ, ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్‌ సోము వీర్రాజు...నిన్నటి నుంచి అందుబాటులో లేకుండా పోయారు. ఇవాళ ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో సమావేశం ఉన్నప్పటికీ....ఢిల్లీకి వెళ్లలేదు. సోము వీర్రాజు అందుబాటులో రాకపోవడంతో పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి కన్నా లక్ష్మినారాయణకు కట్టబెట్టడాన్ని తట్టుకోలేక...అందుబాటులో లేకుండా పోయారని బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయ్.

English Title
mlc somu verraju unhappy on ap bjp president selection

MORE FROM AUTHOR

RELATED ARTICLES