బీజేపీ-టీడీపీ మధ్య విభేదాలకు కారణం ‘ఆయనే’!

Submitted by arun on Sat, 03/24/2018 - 14:30
beeda

బీజేపీ-టీడీపీ మధ్య విభేదాలు రావడానికి సోమువీర్రాజే కారణమని టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ ఆరోపించారు. పట్టిసీమపై మండలిలో చర్చ జరిగినప్పుడు సోమువీర్రాజు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ అంటే ‘భారతీయ జోకర్ల పార్టీ’ అని అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం మీద రోజూ కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ ఏపీకి నిధులు రాకుండా చేశారన్నారు. సోము వీర్రాజు.. వైసీపీతో చేతులు కలిపి ఏపీకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వీర్రాజు మాట్లాడాలని ఈ సందర్భంగా బీద సవాల్ విసిరారు. పట్టిసీమలో అవినీతి జరిగిందంటే.. రైతులే బీజేపీని ఉరితీస్తారన్నారు.
 

English Title
mlc beeda ravichandra fire bjp mlc somuveerraju

MORE FROM AUTHOR

RELATED ARTICLES