ఏపీలో వైసీపీదే అధికారం : బీజేపీ ఎమ్మెల్యే

Submitted by nanireddy on Thu, 05/03/2018 - 11:50
mla vishnukumar raju comments on tdp

ఏపీలో వచ్చే ఎన్నికలో వైసీపీదే అధికారమని జోస్యం చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే. క్రమంగా టీడీపీ గ్రాఫ్ పడిపోతుందన్న ఆయన పాదయాత్రతో వైసీపీ గ్రాఫ్ పెరిగిందని చెప్పుకొచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనార్ధం తిరుపతికి వచ్చిన సందర్బంగా  బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు  ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో ఏపీలో వైసీపీ విజయం ఖాయమని తేల్చేశారు. కాబోయే సీఎం జగనేనని ఢంకా భజాయించారు. అంతేకాదు..అవినీతికి టీడీపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్న విష్ణుకుమార్‌రాజు...  త్వరలోనే ఆ పార్టీ అసలు రంగు బయటపడుతుందని అన్నారు. ఓటుకు నోటు కేసులో బయటపడి సీఎం చంద్రబాబుపై హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేశారని వ్యాఖ్యానించారు.  

English Title
mla vishnukumar raju comments on tdp

MORE FROM AUTHOR

RELATED ARTICLES