మరోసారి నోరుజారిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్!

Submitted by nanireddy on Sun, 06/10/2018 - 08:38
mla-jaleel-khan-fires-women-corporator-vijayawada

విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే  జలీల్ ఖాన్ మరోసారి నోరు జారారు. మహిళా కార్పొరేటర్ పై అయన అనుచిత వ్యాఖ్యలు చేశారు.ప్రొటోకాల్‌ ప్రకారం డివిజన్‌లో అభివృద్ధి పనులు ఎమ్మెల్యేనో, ఆ డివిజన్‌ కార్పొరేటరో ప్రారంభించాల్సి ఉండగా, మరో డివిజన్‌కు చెందిన టీడీపీ నేతలను ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ ఆహ్వానించారు..  వారిచేతనే కార్యక్రమం ప్రారంభింపజేశారు. దీనిపై మహిళా కార్పొరేటర్‌ మండిపడ్డారు. . నా కాళ్లు పట్టుకుంటే నీకు సీటు ఇప్పించా.. ఎక్కువ మాట్లాడొద్దు అంటూ కార్పొరేటర్ పై విరుచుకు పడ్డారు ఎమ్మెల్యే . దానికి ఆమె నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకుని ఎమ్మెల్యే టికెట్ తెచుకున్నావని జలీల్ ఖాన్ ను ఎదురు ప్రశ్నించారు. 

English Title
mla-jaleel-khan-fires-women-corporator-vijayawada

MORE FROM AUTHOR

RELATED ARTICLES